విశాల్ తో అను నటించిన ‘తుప్పరివాలన్’ మంచి విజయాన్ని సాధించింది . ‘డిటెక్టివ్’ పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది . అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ సరసన నటిస్తోంది.‘‘నేను పుట్టి పెరిగిందంతా యు.ఎస్.లోనే అయినా దక్షిణ భారతదేశ సాంప్రదాయాలకు చాలా విలువిస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను సాంప్రదాయికమైన అమ్మాయిగానే గుర్తిస్తుంటారు. మన సంస్కృతిని అనుసరిస్తున్నందుకు చాలా గర్వపడతాను’’ అంటోంది అను ఇమ్మాన్యుయేల్.
ఆమెతన కళ్ల గురించి మాట్లాడుతూ ‘‘నా కళ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటివల్ల ప్లస్, మైనస్ రెండూ ఉన్నాయి. పెద్ద కళ్లుంటే అందంగా కనిపిస్తాం కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఆన్‌స్క్రీన్‌లో కళ్లను సరైన పద్ధతిలో తిప్పగలగాలి. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించకపోతే పెద్ద ప్రమాదంలో పడ్డట్టే. నా దృష్టిలో నయనతార కళ్లను చాలా బాగా తిప్పుతారు. అలాగే నిన్నటితరం నటీమణుల్లో మాధురీదీక్షిత్, శ్రీదేవి కళ్లతో చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. వాళ్లలాగా కళ్లతో నటించాలనే కోరిక నాది. అందులో ఫెయిల్ అయితే మంచి కళ్లు ఉండీ ఉపయోగం లేదు కదా’’ అని చెప్పింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమాలోనూ నాయికగా అను పేరు వినిస్తోంది.