ప్రేమ గొప్పదా లేక స్నేహమా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘2 ఫ్రెండ్స్’ (ట్రూ లవ్). తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సూరజ్ హీరోగా నటిస్తుండగా రవీంద్రతేజ, సానియా, స్నిగ్ద, కార్తీక్, సారా, ధన్ రాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి ఇతర పాత్రధారులు.
నాలుగు షెడ్యూల్స్‌లో ‘2 ఫ్రెండ్స్’ చిత్రీకరణ జరిగింది. బెంగళూరు, అనంతపురం, వరంగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. తాజా షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తామని వారు చెప్పారు.
నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువతకు భవిషత్తు నిర్దేశకత్వం అవుతుంది. ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని” నిర్మాత ముళ్ళగూరు అనంతరాముడు చెప్పారు. మా సంస్థలో ఇది తొలిచిత్రం. కేవలం వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చే విధంగా ఉంటుంది. యూనిట్ అంతా సహకారం అందిస్తున్నారు” అని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం. నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు, రచన, సంగీతం: ఘటికాలం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎల్.బి. శ్రీనివాస్.