మూడు పదుల వయసు దాటాకా కూడా నయనతారకు మూడుకోట్లు భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించడం.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.మూడు పదుల వయసు దాటితే.. కథానాయికలకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడిందని అనుకుంటాము . ఒక వేళ అవకాశాలు వచ్చినా.. పారితోషికం విషయంలో సర్దుకుపోక తప్పదు. కానీ.. నయనతార పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్టార్ హీరోల సరసన ఛాన్సులతో పాటు.. ఇప్పుడున్న అగ్రకథానాయికలు అందుకునే మొత్తానికి రెండింతల రెమ్యూనరేషన్ అందుకుంటోంది నయన్.
తమిళనాట వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. తెలుగులో రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు కమిట్ అయింది నయనతార. అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన బాలకృష్ణ సినిమా కాగా.. మరొకటి ఇటీవల ఆరంభమైన చిరంజీవి సినిమా ‘సై రా.. నరసింహారెడ్డి’. ఈ రెండు పెద్ద సినిమాలతో తిరిగి టాలీవుడ్ లో తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించుకుంది నయన్….
ఈ చిత్రాలకు నయన్ అందుకోబోతున్న పారితోషికమే ఇందుకు నిదర్శనం.బాలకృష్ణ సినిమాకు నయన్ అందుకుంటోన్న పారితోషికం.. 3 కోట్ల రూపాయలట. ఇక చిరంజీవి సినిమాకు వర్కింగ్ డేస్ ఎక్కువ కావడంతో.. మరో అరకోటి పెరిగిందట. మొత్తంగా.. ఈ రెండు సినిమాల రూపంలో ఆరున్నర కోట్లవరకూ అందుకోబోతోంది నయన్. తెలుగులో స్టార్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కు ఇది డబుల్. నిజానికి.. నయన్ ఉన్నా లేకున్నా.. మన స్టార్ హీరోల సినిమాలకు క్రేజ్ ఏమీ తగ్గదు. కాకపోతే.. సీనియర్స్ కావడంతో వారి ఏజ్ గ్రూప్‌కు తగ్గ కథానాయికల విషయంలో ఆప్షన్స్ తక్కువగా ఉండడం వల్ల…నయనతారకు ఉన్న క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని ఆమె అడిగినంతా ఇచ్చేందుకు అంగీకరించాల్సి వస్తోందట.