ప్రవీణ్ తేజ్, నిధి సుబ్బయ్య జంటగా గురువేంద్ర శెట్టి దర్శకత్వంలో వస్తున్న కన్నడ చిత్రం ‘5G’. ఈ సినిమా… నోట్ల రద్దు గురించి, 2000 నోటు, మహాత్మాగాంధీ పాత్ర మొదలైన సన్నివేశాలతో చిత్రీకరించబడిందట. సామాజిక అంశాలతో కూడుకొని ప్రేమకథతో సాగిపోతుంది ఈ చిత్రం. అయితే ఈసినిమా చిత్రీకరణ పూర్తిచేసుకొని సెన్సార్ రిపోర్ట్ కోసం వెళ్లగా ‘సెంట్రల్ బోర్డు అఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ వారు మూడుసార్లు తిరస్కరించి చివరకు నాలుగోసారి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. అంతేకాదు ఈ సర్టిఫికెట్తో పాటుగా కట్టింగ్స్, మ్యూట్స్, కొన్ని మార్పులను సూచిస్తూ దాదాపుగా ఏడుపేజీలతో కూడిన పత్రాన్ని అందజేశారట. ఇదివరకు ‘దండుపాళ్యం’ చిత్రం మూడుపేజీల సూచనల పత్రం అందుకుంది. అంటే ఈసినిమాలో దండుపాళ్యం ను మించిన సీన్లు ఉంటాయా..! అని ఆశ్చర్యానికి గురవుతున్నారు సినిమా జనాలు