ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘నెపోలియన్’. ఆనంద్ రవి దర్శకుడు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరో సందీప్‌కిషన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ వరప్రసాద్‌కు పాతికవేల రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ చెక్‌ను సీనియర్ పాత్రికేయులు బి.ఎ.రాజు, పసుపులేటి రామారావు అందుకున్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ – ”2011-12 నుండి ఆనంద్ రవి నాకు పరిచయమే. తను చేసిన పేరెంట్స్ మూవీ చూసిన రోజే తప్పకుండా ఇతను మంచి దర్శకుడు అవుతాడని భావించాను. ప్రతినిధి సినిమా కూడా చాలా మంచి కథతో రన్ అవుతుంది. తను ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే తను ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడని అనుకున్నాను. అయితే ట్రైలర్, పోస్టర్స్ చూడగానే తనైతేనే కరెక్ట్‌గా యాప్ట్ అవుతాడనిపించింది. ఇక డబ్బుంటే చాలు సినిమాలు తీసేయవచ్చు అనురకునే నిర్మాతలున్న ఈరోజుల్లో గుప్తాగారు ప్రొడక్షన్ గురించి నేర్చుకుని సినిమా నిర్మాతగా మారారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే టెక్నికల్‌గా మంచి సినిమా. నటీనటులు చక్కగా పెర్ఫామ్ చేసినట్లు కనపడుతుంది. ఆనంద్ రవి చాలా పరిణితితో సినిమా చేసినట్టు కనపడుతుంది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారు” అన్నారు.
సందీప్‌కిషన్ మాట్లాడుతూ – ”రవన్న(ఆనంద్ రవి), నాది పుట్టినరోజు ఓకటే. అన్నతో 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కష్టనష్టాల్లో నాకు తోడుగా నిలిచారు. ప్రతినిధి, ఈ సినిమా కూడా నేనే చేయాల్సింది కానీ కుదరలేదు. నెక్స్ట్ మూవీ అయినా చేయాలనుకుంటున్నాను. రవన్న సినిమా కథలన్నీ బావుంటాయి. ఈ నెపోలియన్ సినిమా వాటన్నింటి కంటే మరో ఎత్తులో ఉంటుందని భావిస్తున్నాను. నిర్మాతగారికి థాంక్స్” అన్నారు.
నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి మాట్లాడుతూ – ”నేను ట్రేడ్ రంగంలో ఉండేవాడిని. ఒక టీంతో కలిసి పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆనంద్ రవి లేకుంటే ఈ సినిమా లేదు. రవికి, టీమ్‌కి థాంక్స్” అన్నారు.
ఆనంద్ రవి మాట్లాడుతూ – ”నేను ఈ కథతో చాలా మందిని కలిశాను. ‘నీడపోయింది’ అనే పాయింట్ చెప్పగానే ఇది షార్ట్ ఫిలిమా అని అడిగారు. తర్వాత నేనే హీరో అనగానే నువ్వే హీరోనా అని చాలా మంది అన్నారు. ప్రొడ్యూసర్ ఎవరని చాలా మంది అడిగారు. ఇలా అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్ జోనర్ మూవీయే అయినా, కొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఇంత వరకు ప్రేక్షకులు నా సినిమాల నుండి ఏం కోరుకుంటున్నారనే అనుభవాన్నంతా కూడా ఈ సినిమాలో రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా” అన్నారు.
నిర్మాత బిఎ.రాజు మాట్లాడుతూ – ”నెపోలియన్ ముందు నుండే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. డెఫనెట్‌గా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మార్గల్ డేవిడ్ మాట్లాడుతూ – ”కెమెరామెన్‌గా నా తొలి చిత్రం ‘నెపోలియన్’. అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆనంద్రవి, నిర్మాత భోగేంద్ర గుప్తాగారికి థాంక్స్” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సదాశివుని మాట్లాడుతూ – ”నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన తొలి సినిమా ఇది. నీడ ఎక్కడికి పోయిందనేదే కొత్త కాన్సెప్ట్. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు.
కోమలి మాట్లాడుతూ – ”సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. 110 శాతం సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఎంగేజ్ చేస్తుంది” అన్నారు.
లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ – ”రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు కొత్తదనం ఇచ్చే సినిమా అనడంలో ఏ సందేహం లేదు. నీడ కనపడకపోవడం అనేదే కొత్త కాన్సెప్ట్. అంతే కాకుండా దర్శకుడు ఆనంద్ రవి ప్రతినిధి సినిమాలో సోషల్ అవెర్నెస్ పాయింట్‌ను ఎలా టచ్ చేశాడో ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయనడంలో సందేహం లేదు. నిర్మాత నాకు మంచి మిత్రుడు. చాలా మంచివాడు. తను సినిమా చేస్తాననడంతో ముందు భయపడ్డాను కానీ తను అనుకున్న ప్లానింగ్‌లో అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాడు” అన్నారు.
ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్: సిద్ధార్థ్ సదాశివుని, సినిమాటోగ్రఫీ: మార్గల్ డేవిడ్, పాటలు: బాలాజీ, ఆర్ట్: బాబ్జి, నిర్మాత: భోగేంద్ర గుప్తా మడుపల్లి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్ రవి.
Sundeep Kishan & KL Damodar Prasad launch ‘Napolean’ Trailer
‘Napolean’, directed by Anand Ravi, is being made by Acharya Creations and Anand Ravi Concepts. Bogendra Gupta Mudupalli is the producer. The film’s Trailer was launched on the hands of actor Sundeep Kishan and producer KL Damodar Prasad on Wednesday morning at an event held at Prasad Labs, Hyderabad.
On the occasion, Bogendra Gupta’s NGO, Triple S, presented a cheque of Rs. 25,000 to senior PRO and producer BA Raju and senior journalist Pasupaleti Ramarao towards the medical expenses of a journalist named Varaprasad.
KL Damodar Prasad said, “I have known Anand Ravi since 2011. The day I watched his movie ‘Parents’, I knew he will surely become a very good director. He went on to write a very good story for ‘Prathinidhi’. When I came to know that he is playing the lead’s role in ‘Napolean’, I wondered as to why he is keen on acting. But when I watched the Teaser and the Trailer, I came to the conclusion that only he would have been apt for the role. In these days, it’s commonplace to see people turning into producers just because they have money. But Gupta garu stepped into film production only after learning about it. ‘Napolean’ is a technically fine film. The actors seem to have done a very good job. Anand Ravi is coming across as a mature actor. I am sure the audience are going to love the movie.”
Sundeep Kishan said, “Ravi anna (Anand Ravi) and I were born on the same date. I have known him for 12 years. He has always stood by me through thick and thin. I was to do ‘Prathinidhi’ and this film as well, but I couldn’t. I want to do at least his next movie. Ravi anna’s stories are always good. ‘Napolean’, I think, will be a cut above the rest.”
Bogendra Gupta said, “I used to be in trading business. This is the first time that I am working with a team. This film wouldn’t have been there but for Anand Ravi.”
Anand Ravi said, “I have told this story to a lot of people. As soon as I said that the hero loses his shadow, they asked me if it’s a short film. When I would tell them I am the hero, they would show surprise. They would also ask as to who is the producer. ‘Napolean’ will answer all their questions. Although it’s a thriller, the concept is new. I have written into the film all that my audience expect from me. Everyone will connect with the movie.”
BA Raju said, “The film has always had hype around it. The Trailer is very distinct. The film will surely be a big success.”
The cinematographer Margal David said, “This is my first film as a cinematographer. I thank the director and the producer.”
Music director Siddharth Sadashivuni said, “This is my first film. The concept of the hero losing his shadow will surely be liked by one and all.”
Actress Komali said, “This is a suspense thriller movie. This will definitely impress the audience 110 per cent. This will surely engage them.”
Lakshmi Bhupal said, “This will be found to be a refreshing film by the audience. I have no doubt that Anand Ravi is touching upon a socially relevant point in the movie just as he did in the case of ‘Prathinidhi’. The producer is a friend of mind. Although I was scared before he jumped into production, I am happy that he completed the movie as per the planned budget.”
Music-directed by Siddharth Sadasivuni, the film marks Anand Ravi’s debut directorial (he has also penned the story and screenplay). The cinematography is by Margal David. Lyrics are by Balaji. Art direction is by Babjee. Produced by Bhogendra Gupta, ‘Napolean‘ is from the stable of Acharya Creations and Anand Ravi Concepts.