తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత్రికేయుడిగా ‘కృష్ణ పత్రిక’లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ‘సంతోషం’ సినీ వార పత్రికతో అందరికీ సంతోషం సురేష్‌గా పరిచయమైన సురేష్ సంతోషం అవార్డ్స్ పేరిట 15 సంవత్సరాలుగా అవార్డులను బహుకరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సంతోషం 16వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది. 2017, ఆగస్ట్ 12న సంతోషం అవార్డుల వేడు ప్రధానోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కర్టెన్ రైజర్స్ ప్రోగ్రామ్‌లో సంతోషం సురేష్, హీరో ఆది, మా అధ్యక్షుడు శివాజీ, రెజీనా, హెబ్బా పటేల్, ఏడిద రాజా, ఏడిద శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
‘మా’ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ – సంతోషం సురేష్ వెనుక ఇండస్ట్రీ అంతా ఉంటుంది. ఇదంతా అతను చిరునవ్వుతో సంపాదించుకున్నదే. పాలకొల్లు నుండి వచ్చిన రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. మా అసోసియేషన్ తరపున పేద కళాకారులకు ఆర్ధిక సాయాన్ని చేస్తున్నారు. ఈ అవార్డ్స్ వేడుక వందేళ్లు జరగాలని కోరుకుంటున్నాను…అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ – సంతోషం అవార్డ్స్‌లో ప్రేమ కావాలి చిత్రానికి నాకు బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డ్ వచ్చింది. 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. సురేష్‌గారికి అభినందనలు. ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఎన్నోజరగాలని కోరుకుంటున్నాను… అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ – సురేష్ కొండేటిగారికి, సంతోషం అవార్డ్స్ టీంకు అభినందనలు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను…అన్నారు.
రెజీనా మాట్లాడుతూ – నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను విన్న అవార్డ్స్ సంతోషం అవార్డ్స్. ఒక వ్యక్తిగా సురేష్‌గారు ఈ అవార్డ్స్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంత ఈజీ కాదు. ఇలాంటి మంచి విషయాన్ని చేస్తున్న సంతోషం సురేష్, అతని టీంను అభినందిస్తున్నాను. ఈ అవార్డ్స్ ఇలాగే పాతిక, యాబై ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను… అన్నారు.
సంతోషం సురేష్ మాట్లాడుతూ – గత పదిహేనేళ్లుగా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ప్రతి ఏడాది ఏదో ఒక సర్ప్రైజ్తో సంతోషం అవార్డ్స్ జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో సంతోషం అవార్డ్స్ జరుగుతుంది. చిరంజీవిగారు, నాగార్జునగారు, బాలకృష్ణగారు, వెంకటేష్‌గారు ఇలా అందరూ హీరోలు నన్నెంగానో సపోర్ట్ చేశారు. నేను ఉన్న రోజులు ఈ అవార్డ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తాను. నాగార్జునగారు కారణంగానే ఈ అవార్డ్స్ కంటిన్యూ చేస్తున్నాను. మొదటి వార్షికోత్సవంలో నాగార్జున ఫిలింఫేర్లా మనకు కూడా సంతోషం అవార్డ్స్ ఉంటే బావుంటుందని అన్నారు. ఆయన చిన్న కోరికను నేరవేరుస్తూ దక్షిణాది భాషల్లో అవార్డ్స్‌ను నిర్వహిస్తూ వస్తున్నాను… అన్నారు.