ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఓ చిత్రం ప్రారంభం కానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ…’నేను రూపొందిస్తున్న 32వ చిత్రమిది. ఈ నెల 4న సినిమా ఓపెనింగ్ ఉంటుంది. ఇందులో 11 పాటలున్నాయి. రీరికార్డింగ్ కూడా పూర్తయ్యింది. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఉండే చిత్రమిది. దేశంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న హ్యాపీగా లేడు. కష్టపడి పండించిన పంటకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.
ఆరుగాలం పండించే రైతు జీవితానికి ఎటువంటి భరోసా లేకుండా పోయింది. ఉద్యోగులు నెల నెల జీతాలతో పాటు పదవీ విరమణ తర్వాత పింఛన్లు తదితర బెనిఫిట్స్ పొందుతారు. మరి రైతు మాత్రం చనిపోయేంత వరకు భూమినే నమ్ముకొని బతకాల్సి వస్తుంది. కాయకష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఒక వేళ వచ్చినా దళారులు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ప్రకృతి, దళారుల మధ్య నలిగిపోతూ రైతు చివరికి బలవన్మరం పొందుతున్నాడు. ఈ రైతు సమస్యలను ఆధారంగా చేసుకొని రైతు చిరంజీవిగా ఉండాలనే భావనతో స్నేహ పతాకంపై ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను”అని అన్నారు. అని అన్నారు.