ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయనంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్. సరిత నిర్మిస్తోన్న చిత్రం `ఇదేం దెయ్యం`. శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు. సాక్షి కక్కర్ , రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి కీలక పాత్రధారులు. వి. రవివర్మ దర్శకత్వం వహిచగా, బాలు స్వామి సంగీతం అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ, ` హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. భయపడే సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఆ కష్టాలు థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను నవ్విస్తాయి. ముఖ్యంగా రచ్చ రవి, ఆర్ పి తో నా కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. సినిమా బాగా వచ్చింది. ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ, ` రచ్చరవి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని కథ రాసుకున్నా. నేను అనుకున్న దానికన్నా బాగా నటించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హారర్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని పనులు పూర్తిచేసి ఈనెల 4న రిలీజ్ చేస్తున్నాం. మాకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు. ఏపీ, తెలంగాణ రాస్ట్రాలలో మొత్తం 100 థియేటర్లలలో సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
సంగీత దర్శకుడు బాలుస్వామి మాట్లాడుతూ, ` మా దెయ్యాలు భయపెడుతూనే నవ్విస్తాయి. అవే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ఇక ఆడియో కు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని టీమ్ అంతా నమ్ముతున్నాం` అని అన్నారు.
డిrబ్యూటర్ రామకృష్ణ మాట్లాడుతూ, ` మా సంస్థ ద్వారా మొత్తం మూడు జిల్లాలలో ఈ సినిమా డిస్ర్టిబ్యూట్ చేస్తున్నాం. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. పెద్ద సక్సెస్ అవుతుంది` అని అన్నారు.
హీరోయిన్ సాక్షి కక్కర్ మాట్లాడుతూ, `ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలన్నింకంటే భిన్నమైన పాత్ర పోషించాను. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.
ఈ సమావేశంలో యూనిట్ సభ్యలు ఆర్.పి, రచన స్మిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర పాత్రల్లో జీవా, గౌతం రాజు, అప్పారావు, అర్షిత్ సాయి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణ ప్రసాద్, పాటలు: సాయి కుమార్, నేపథ్య సంగీతం: ఏలేందర్, సహ-నిర్మాతలు: ఎమ్. రత్న శేఖర్ రావు, ఎమ్. మధుసూదన్ రెడ్డి, వి. రామ్ కిషోర్ రెడ్డి, ఎమ్. సౌజన్య, నిర్మాత: సరిత, దర్శకత్వం: వి. రవివర్మ.