ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ అక్టోబర్ 15, 1931 న జన్మించారు. భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి గా పనిచేసిన అబ్ధుల్ కలాం ఎందరో మనసులలో సుస్థిర స్థానం సంపాదించారు. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగిన కలాం భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. మ్యాన్ ఆఫ్ మిస్సైల్ గా పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు.
ప్రస్తుతం వరుస బయోపిక్ లు సినీ లవర్స్ ని సంతృప్తి పరుస్తుండగా, ఇప్పుడు అబ్ధుల్ కలాం బయోపిక్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయించారు. ‘డాక్టర్ అబ్ధుల్ కలాం’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుండగా’ హీ డ్రీమ్, హీ కంకర్డ్ ‘అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.