ప్రఖ్యాత రచయిత మునిమాణిక్యం నరసింహరావు కథలు సంపుటి 2 ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్వగృహంలో ఆవిష్కరించారు
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… తనకు మునిమాణిక్యం నరసింహారావు అన్నా ఆయన సాహిత్యమన్నా కూడా చాలా ఇష్టం.. నేటి జనరేషన్ కు ఆయన సాహిత్యం అవసరం ఎంతైనా ఉంది.నాటి తరం గొప్ప రచయితల్లో ఆయన కూడా ఒకరు.. సాధారణంగా హాస్యం పుట్టాలంటే ఎవరినో ఒకరిని వెటకారం చేయాలి. అయితే అలా ఎవ్వరినీ ఏమీ అనకుండా సున్నితమైన సాహిత్యాన్ని పుట్టిస్తారు. ఇలాంటి సాహిత్యం పుట్టించడం ఆయనకే సాధ్యం. నాకు స్వతహాగా హాస్యం అంటే ఇష్టం మునిమాణిక్యం నరసింహారావు గారి హాస్యం అంటే ఎంతో ఇష్టం అన్నారు. ఈ తరం వాళ్ళకు ఇలాంటి హాస్యం అవసరత ఎంతో ఉంది అన్నారు .
ఈ కార్యక్రమంలో మునిమాణిక్యం నరసింహారావు సాహితీ పీఠం నిర్వాహకులు మాట్లాడుతూ మా తాత గారైన మునిమాణిక్యం నరసింహారావు గారి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న త్రివిక్రం శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిమాణిక్యం నరసింహారావు సాహితీ పీఠానికి చెందిన యం. శేషుకుమారి, యం. యం జయమణి, యం. రాంచందర్, యం శ్రీనివాస్, వి.రామలక్ష్మి లు పాల్గొన్నారు.