“ప్రేమిక” తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన మూవీ . ఈ మూవీని దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాటలు, దర్శకత్వం మహేంద్ర. ఈ సినిమా టీజర్ ను ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ఈ చిత్రం టీజర్ చాలా బాగుందని తెలిపారు. డైరెక్టర్ ఇలాంటి చిన్న చిత్రాలు చాలా తీయాలని కోరారు. ఈ టీజర్లో తనీష్ నటన చాలా బాగుందని అభినందించారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎలాంటిదో చిన్న సినిమాలు కూడా అలాంటివేనని అన్నారు. ఈ చిన్న చిత్రాలను జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు. సినిమా రిలీజ్ చేయడానికి మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. చిన్న చిత్రాల వల్ల చాలా మంది టెక్నిషియన్స్‌తో పాటు పలువురికి జీవనోపాధి దక్కుతుందని అన్నారు.
చిత్ర దర్శకుడు మహేంద్ర ఈ మూవీ విశేషాలను వివరించారు…. ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనలకు ఆధారంగా నిర్మించిన చిత్రం ఈ ‘ప్రేమిక’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో “కొంతమంది అల్లరి చిల్లరిగా అమ్మాయిల వెనుక తిరిగే యువకులకు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలంటే ప్రేమిస్తే సరిపోద్ది. అదే అమ్మాయిని పోషించాలంటే సంపాదించాలి” అన్న నిజం తెలుసుకున్న మరుక్షణం వాళ్ల జీవితంలోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాళ్లు ప్రేమలోను, జీవితంలోను గెలిచారా? ఓడారా? అన్నది ఈ చిత్రంలోని ముఖ్యాంశం. ఆద్యంతం ఉద్వేగ భరితంగా ఈ కథ ముగుస్తుంది. ఈ మూవీలో లవ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మెసెజ్ కూడా ఉంటుందని తెలిపారు. ఇక ఎస్.వి.ఎన్.రావు వల్లే నటుడు తనీష్ దగ్గరికి తాను వెళ్లగలిగానని దర్శకుడు మహీంద్ర తెలిపారు. అనుకున్న పాయింట్‌ని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తీయగలిగానని చెప్పారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయన్నారు. చిన్న సినిమాగా ఈ చిత్రాన్ని చూడొద్దన్నారు. ఆడియో త్వరలో రిలీజ్ అవుతుందన్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని వెల్లడించారు.
హీరో తనీష్ మాట్లాడుతూ…ప్రేమిక అనేది కేవలం చిత్రమే కాదని టాలెంటెడ్ యువకుల కష్టమని తెలిపారు. ఆ కష్టానికి నిర్మాత లక్ష్మయ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారన్నారు. సినిమాకి ఏది అవసరమో..ఎప్పుడు ఏం కావాలన్నా ఇచ్చారన్నారు. ఈ చిత్రం టీం మొత్తం ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్ర విజయానికి అందరూ దోహదపడాలన్నారు.
అనంతరం శ్యాం సుందర్‌రెడ్డి మాట్లాడుతూ… తమ సోదరుడు దేశాల లక్ష్మయ్య ఎంతో నమ్మకంతో ఈ సినిమాకి నిర్మాతగా మారారని చెప్పారు. ట్రైలర్ చూస్తేనే ఈ చిత్రం విజయం సాధిస్తుందని తెలుస్తుందని అన్నారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని కోరారు.
అనంతరం జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ… ఫిల్మ్‌ఛాంబర్‌కు తాను రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ చిత్రం ట్రైలర్ అద్భుతంగా ఉందని ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ చిత్రంతో లక్ష్మయ్య కష్టం ఏంటో తెలుస్తుందని వెంకటకృష్ణ అన్నారు. ఈ సినిమాని బతికిస్తే చాలా మంది బతుకుతారని అన్నారు.
ఈ చిత్రం కోసం నైట్ టైం ఎక్కువ కష్టపడ్డామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శౌర్య అన్నారు. బెంగుళూరులో ఈ చిత్రాన్ని తీశామని వెల్లడించారు. మంచి సమయంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఎక్కువ థియేటర్లు ఈ చిత్రానికి దొరకాలని కోరుకుంటున్నామన్నారు
టీజరే కాదు సినిమా కూడా చాలా బాగా వచ్చిందని మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి తెలిపారు. బాగా పిక్చరైజ్ చేశారని సినిమా విజయానికి అందరూ దోహదపడాలని కోరారు.
ఈ చిత్రంలో తనీష్ మెచ్యూరిటీగా నటించాడని నటుడు రవివర్మ అన్నారు. ఇది చాలా మంచి చిత్రమని , ఈ చిత్రంలో తనది విలన్ రోల్ అని తెలిపారు. ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తానని అన్నాడు.ఈ చిత్రం ప్రొడ్యూసర్ చాలా స్వీట్ పర్సన్ అని, ఎంతటి బాధనైనా ఇష్టంగా స్వీకరిస్తారన్నారు
సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదని ప్రొడ్యూసర్ దేశాల లక్ష్మయ్య వెల్లడించారు. వారి అల్లుడు శౌర్య కథ బాగుందని ఈ సినిమా మనం తీద్దామని ప్రోత్సహించాడని చెప్పారు. ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు. కొత్త డైరెక్టర్‌కి ప్రోత్రాహం ఉంటేనే ఇంత బాగా సినిమా తీయగలరని అన్నారు.
తనీష్,శృతి యుగళ్,కవిత,రవి వర్మ,వైభవ్ సూర్య,కోటేశ్వరరావు,బ్యాంక్ సురేష్,జబర్దస్త్ మహేష్,దేవా,నారి,వెంకటరాజా,వెంకట్,రూపా లక్ష్మి,బేబి సింధు నటించిన ఈ చిత్రానికి…
సాంకేతిక నిపుణులు…
బ్యానర్ : దేశాల ఆర్ట్ మూవీస్
సమర్పణ : స్టార్ లైన్ మూవీస్
నిర్మాత : దేశాల లక్ష్మయ్య
నిర్వహణ : ఎస్విఎన్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శౌర్య
సంగీతం : దిలీప్ బండారి
సినిమాటోగ్రఫి : రాహుల్ మాచినేని
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
విజువల్ ఎఫెక్ట్స్ : నవీన్
పి.ఆర్.వో : టి.ఎస్.ఎన్ మూర్తి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : మహేంద్ర