కిషోర్ తేజ , భవ్యశ్రీ జంటగా దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం. ఈ మూవీ టీజర్.. దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయగా, ఫస్ట్ లుక్.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ లాంచ్ చేశారు.
రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ‘బాగుంది’ సినిమా దర్శకులు రామ్ కుమార్ కి సూపర్ స్టార్ కృష్ణ గారి తో పని చేసిన అనుభవం ఉంది. నేను కూడా కృష్ణతో ‘సర్వాయి పాపన్న’ సినిమా చేశాను. రామ్ కుమార్ “బాగుంది” సినిమా చాలా బాగా తీశారు. టీజర్ చూశాక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తీసినట్టు అనిపిస్తుందని. హీరో కిషోర్ తేజ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. చాలా హార్డ్ వర్కర్. సినిమా మంచి సక్సెస్ కావాలి. సినిమా విడుదల సమయంలో నా వంతు సాయం అందిస్తాను అని అన్నారు.
వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ కుమార్ చాలా పెర్ఫెక్ట్ గా తీశారు. నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. వారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు వచ్చి మరిన్ని సినిమాలు తియ్యలని కోరుకుంటున్నాను.. అన్నారు.
సెవన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా డైరెక్టర్ రామ్ కుమార్ ఎప్పటి నుంచో మిత్రుడు. ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు తీశారు. మంచి హార్డ్ వర్కర్. ప్రస్తుతం “బాగుంది” బాగా తీశారు.. సినిమా సక్సెస్ అవ్వాలని, భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు..
చిత్ర నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ… డైరెక్టర్ రామ్ కుమార్ చిన్ననాటి స్నేహితుడు ఓ సినిమా చేద్దామన్నారు. కథ విన్నాను బాగా నచ్చింది. సినిమాపై నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అన్ని డైరెక్టర్ దగ్గరుండి చూసుకొని సినిమాను పూర్తిచేశారు. మా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకులు రామ్ కుమార్ మాట్లాడుతూ… శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన “బాగుంది” సినిమా సస్పెన్స్ జానర్ లో తీశాము. సినిమా చూస్తే అంతా థ్రిల్ అవుతారు. కథ చెప్పకుండానే నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు సినిమా చేద్దామని ముందుకు వచ్చారు. హీరో కిషోర్ తేజ చాలా బాగా చేశారు. హీరోయిన్ భవ్యశ్రీ చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ డా. మహేంద్రబాబు ,హీరో కిశోర్ తేజ , హీరోయిన్ భవ్యశ్రీ, కథ రచయిత అశోక్, నటులు విజయ్ భాస్కర్, చిట్టిబాబు, మల్లిక్, పలువురు టెక్నిషియన్స్ పాల్గోన్నారు.