భాలా క్రియేషన్స్ పతాకంపై రజినీ కుమార్, జీవన్ కుమార్ సపాన్స్ హీరో, హీరోయిన్స్ ను, దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ ముప్పల ను పరిచయం చేస్తూ ప్రసాద్ రాజు నిర్మిస్తున్న చిత్రం “అయ్యో పాపం”. సమాజంలో, కుటుంబాలలో జరుగుతున్న సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ ..ఎలా అరికట్టాలి అనే దాని పై మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “అయ్యోపాపం”. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన టి. యఫ్. సి. సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ లు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ ను విడుదల చేశారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శంకర్ గత మూడు పర్యాయాలు గా సర్పంచ్ గా గెలుపొంది నేటి సమాజంలో జరుగుతున్న పరణమాలపై
ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలోని సాంగ్ చాలా బాగుంది. ఈ పాటలాగే ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిన్న సినిమా “బలగం” పెద్ద హిట్ అయ్యి ప్రూవ్ అయిన సందర్బంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కథతో సినిమా తీస్తే ఆడరిస్తారనే నమ్మకంతో ముందుకు వస్తున్నారు.అలాంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా కూడా “బలగం” అంతటి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 12,000, ఆంధ్ర లో 13,000 సర్పంచులు ఉన్నారు. వారందరి సాధక బాధలను ఇతివృత్తంగా చేసిన “మా మంచి సర్పంచి మా..శంకరన్న మాట తప్పని వాడు మన శంకరన్న” పాటను రెండు తెలుగు రాష్ట్రాల సర్పంచ్ లందరికీ అంకితం చేస్తున్నాము. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేను రాసుకున్న ఫ్యామిలీ, సెంటిమెంట్, క్రైమ్ కథను నిర్మాత ముప్పాల ప్రసాద్ రాజు గారికి వినిపించడంతో కథ నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు సహ నిర్మాతలు రజనీ కుమార్, మొగిలే విజయ్ కుమార్ చిన్నా లకు ధన్యవాదాలు అని అన్నారు.
హీరో రజిని కుమార్ మాట్లాడుతూ .. శంకర్ చేస్తున్న మొదటి ప్రయత్నం పెద్ద విజయం సాదించాలి అన్నారు.
సంగీత దర్శకుడు బాను మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలిద్దరూ కూడా ఈ సినిమాలో మంచి సాంగ్స్ కావాలని పట్టు బట్టి మాతో చేయించుకున్నారు .పాటలు మాదిరే సినిమా కూడా బిగ్ హిట్ అవుతుంది అన్నారు.
గిరిబాబు తనయుడు బోస్ బాబు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
జబర్దస్త్ షేకింగ్ శేషు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ సినిమా బలగం సినిమా వంటి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ : టి. నారాయణ, నిర్మాత: ముప్పాల ప్రసాద్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొర్ర శంకర్ నాయక్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వి. రజనీ కుమార్, మొగిలే విజయ్ కుమార్ చిన్నా
కెమెరా: ఎ. వెంకట్,ఎడిటర్, గ్రాఫిక్స్: పాశికంటి శ్రీనువాస్,
సంగీతం: బాను, పాటలు: కొల్లా శంకర్ నాయక్