లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. దీపక్ కొలిపాక దర్శకత్వంలో ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ఓ కల చిత్రం అనేది ఓ సోషియో లవ్ డ్రామా. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా మంది నిజజీవితాలకు దగ్గరగా ఉంటుంది. ప్రతిఒక్కరికీ ఈ చిత్రం గుర్తుండిపోతుంది. ఇది నా మొదటి చిత్రం. గతంలో నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించాను. అలాగే దర్శకత్వంలో నేను ప్రత్యేక శిక్షణ పొందాను అని అన్నారు.
ప్రొడ్యూసర్ మహేష్ మాట్లాడుతూ… ఓకల చిత్రం ఏప్రిల్13న విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇది నా మొదటి చిత్రం. రెండవ చిత్రం కూడా షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకి సిద్ధంగా ఉంది.
ఫిల్మి ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… ప్రొడ్యూసర్ మహేష్ నాకు మంచి ఫ్రెండ్. ఇది మహేష్ మొదటి చిత్రం కొత్తవాళ్ళతో సినిమా తీయడం గొప్పకాదు అది విడుదల చేయడం చాలా కష్టం. థియేటర్లో విడుదలయ్యాక కలెక్షన్స్ రాకపోతే నష్టపోకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా మరో దారి అనుకోవాలి. కానీ చాలా మంది అది తెలియక రెండు ప్లాట్‌ఫామ్స్‌లో డబ్బులు దండుకోవచ్చు అనుకుంటారు. ఓకే ఏది ఏమైనా కూడా ఓకల చిత్ర టీమ్ అందరికీ కూడా నా ఆల్ ద బెస్ట్ అని అన్నారు.
హీరో గౌరీష్ మాట్లాడుతూ… చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. అందరూ మా సినిమాని చూసి ఆదరించాలని మనసార కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరోయిన్ రోషిని మాట్లాడుతూ… ఇదొక గొప్ప రైడ్ లాంటి చిత్రమనాలి. నేను షూటింగ్ సమయంలో ఎంతగా ఆనందపడ్డానో సినిమా చూసేటప్పుడు మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.
గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ (కమెడియన్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి. సంగీతం: నీలేష్ మందలపు
ఎడిటర్: సత్య గిడుటూరి ఆర్ట్: ప్రేమ్ కుమార్
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి
కో ప్రొడ్యూసర్ :అదిత్య రెడ్డి, దర్శకత్వం: దీపక్ కొలిపాక