ఎర్రగుడి (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) అన్విక ఆర్ట్స్ వారి చిత్ర ప్రారంభోత్సవం 19వ తేదీ జరిగింది. 1990’s లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షి గా నిలిచి.. గెలిపించిన సరి కొత్త ప్రేమ కథ ఇది.
నటులు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. సంజీవ్ గారు మల్టీటాలెంటెడ్ పర్సన్. నాకు ఈ సినిమాలో కొత్త తరహా పాత్ర ఇచ్చారు. ఈ “ఎర్రగుడి” సినిమా అమ్మవారి ఆశీస్సులతో పెద్ద విజయం సాధిస్తుంది అన్నాడు.
హీరో- వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్.. ఇతర పాత్రల్లో ఆదిత్య ఓం, రఘుబాబు, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, అజయ్ ఘోష్, ఢిల్లీ రాజేశ్వరి, వనిత రెడ్డి, రాజేష్ చీరాల, జ్యోతి, శ్రావణి, అయేషా, దేవిశ్రీ ప్రభు, రామ్ రమేష్, హరీష్ నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎస్.ఎన్ .హరీష్ , సంగీతం : మాధవ్ సైబా, రామ్ సుధి, సంజీవ్, లిరిక్స్ : సాగర్ నారాయణ, రాజాపురం శ్రీనాథ్ రెడ్డి,ఫైట్స్ : నటరాజ్, కొరియోగ్రఫీ: సూర్యకిరణ్, అనీష్, ఆర్ట్ : కె.వి. రమణ,