“ఇక నా జీవితం అయిపోయింది. నేను సినిమాలు చేస్తానా లేదా.. అనుకున్నాను. కోవిడ్ ఈ టైం లో నేను బతుకుతానా? లేదా అనిపించింది. ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేని నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయితే ఈ రోజు నేను మీ ముందు నిలుచున్నాను.. అంటే మీ అందరూ బ్లెస్సింగ్స్ వల్లే. మీకు నా ధన్యవాదాలు. నేను కోలుకున్న తరువాత ఈ “శేఖర్” సినిమా చేయడం జరిగింది. పది సినిమాలు చేసినంత కష్టం ఈ సినిమాకు పడ్డాను. అందరం ఈ సినిమాకు ప్రాణం పెట్టి తీశాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత.తను మా వెనకుండి నడిపించింది.దాని ఫలితం ఈ సినిమాలో కనిపిస్తుంది అన్నారు…’శేఖర్’ చిత్ర హీరో రాజశేఖర్ మాట్లాడుతూ…
డా. రాజశేఖర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే కార్యక్రమంలో డా. రాజశేఖర్ 91 వ సినిమా” శేఖర్” చిత్రంలోని “కిన్నెర” సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… శేఖర్ సినిమా మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఎందుకంటే శేఖర్ సినిమా అనుకున్నప్పుడు రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. దాంతో మేము బర్త్ డే కూడా జరుపుకోలేదు. తనకు సినిమా అంటే పిచ్చి. ఎప్పుడూ సినిమా గురించే డిస్కస్ చేస్తుంటాడు.ఈ శేఖర్ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులకు,టెక్నిసిషన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. 30 సంవత్సరాలు గా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రేమించే.. అభిమానించే మిమ్మల్ని మా ముందు వుంచినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ కూడా వస్తుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను
రాజశేఖర్ కూతురు నటి శివాని మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా నాకు ప్లస్ అవుతుంది అన్నారు మా డాడీ. అది నాకు పెద్ద బ్లెస్సింగ్.జనరల్ గా మా అమ్మ నాన్న లే నాకు ప్లస్. అనూప్ సర్ ఈ సినిమాలో చాలా బాగున్నావ్ అని చెప్పడం జరిగింది దానికి కారణం మా మమ్మీ డైరెక్ట్ చేయడం వలనే.
రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్