‘సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్’ పతాకంపై శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఈ నెల 31 న విడుదల అవుతోంది .
“సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్” వి.కె రాజు మాట్లాడుతూ…
“మంచి కథను సెలెక్ట్ చేసుకొని దర్శకుడు ఉమా శంకర్ సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ గా తెరకెక్కించాడు.ఇందులో పాటలు చాలా బాగున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న ఠాగూర్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 31 న వస్తున్న మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు
దర్శకుడు ఉమాశంకర్ మాట్లాడుతూ … “సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి.. తెలుపుతూ ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీ రూపొందించడం జరిగింది. ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో వర్క్ చేశారు..హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.సంగీత దర్శకుడు చక్కటి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంద”ని అన్నారు.
డిస్టిబ్యూటర్ ఠాగూర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. “సాఫ్ట్ వేర్ బ్లూస్’ ప్రీమియర్ లో అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చక్కటి కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ఓటిటి లో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్ లోనే విడుదల చేయాలని ఈ నెల 31 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాన”ని అన్నారు.
హీరో శ్రీరాం మాట్లాడుతూ.. “చిత్ర దర్శకుడు ఉమాశంకర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తూ తనకు వస్తున్న నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని, సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో… సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కు కష్టాలు వుంటాయని ఫుల్ కామెడీ తో అందరికి అర్థమయ్యేలా ఈ మూవీ చేయడం జరిగింది. ఫస్ట్ మూవీ అయినా చాలా చక్కగా తీశాడు.ఈ సినిమా చూసిన వారందరికీ “సాఫ్ట్ వేర్ బ్లూస్” కచ్చితంగా కనెక్ట్ అవుతుంది” అన్నారు.
హీరోయిన్ భావన మాట్లాడుతూ… “చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయి.ఇది నాకు మొదటి చిత్రమైనా సెట్ లో నటీనటు లందరూ నాకు బాగా కో ఆపరేట్ చేశారు.ఈ సినిమాలో నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి, ఎడిటర్: వి.కె.రాజు.