అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ‘విరాట్ రాజ్’. అతను హీరోగా రూపొందుతున్న’సీతామనోహర శ్రీరాఘవ’చిత్రం వైభవంగా ప్రారంభం అయింది. ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేసారు. అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి శ్యామల విరాట్ రాజ్ కు ఆశీస్సులు,శుభాకాంక్షలు తెలియ చేసారు.
అటు పెద తాత హరనాథ్ గారు, ఇటు తాత వెంకట సుబ్బరాజుల స్ఫూర్తి తో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను…అన్నారు ‘విరాట్ రాజ్’
దర్శకుడు దుర్గా శ్రీ వత్సస.కె.మాట్లాడుతూ…మాస్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అన్నారు. ‘హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కె.జి.ఎఫ్. 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్ రుర్’ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
వెండితెరకు మరో నట వారసుడిని తమ ‘వందన మూవీస్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు… చిత్ర నిర్మాత సుధాకర్.టి. నవంబర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని,ఓ మంచి కథతో వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ పరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు.
సంగీత దర్శకుడు రవి బస్ రుర్ మాట్లాడుతూ… ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటం ఆనందంగా ఉందన్నారు. కధానాయిక రేవ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విరాట్ రాజ్ తో నాయికగా రేవ… ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: కాశ్యప్ గోలి; ఆర్ట్: రామాంజనేయులు; నృత్యాలు: శేఖర్, జానీ మాస్టర్స్