‘కొండపొలం’ చిత్రం వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్ తేజ్,క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్నఈమూవీ నుండి శుక్రవారం ‘ఓబులమ్మ…’ అంటూ సాగే.. ఎం.ఎం.కీరవాణి శ్రావ్యమైన బీట్ తో అందించిన అద్బుతమైన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది . రైటర్‌గా ఎం.ఎం.కీరవాణి సరికొత్త పదాలతో రాయలసీమ యాసలో ఈ పాటను రాయడం విశేషం. పాటలో వ్యక్తపరిచిన భావాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గట్లు.. మాస్ లుక్ గడ్డంతో వైష్ణవ్ తేజ్, గ్రామీణ అమ్మాయిగా రకుల్ ప్రీత్ జోడీ తాజాదనాన్ని సంతరించుకుంది .
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.8గా రూపొందిన అడ్వెంచరస్ మూవీ `కొండ పొలం`కు సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల ఆధారం. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్`అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు నిర్మాతలు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్ శ్రవణ్ కటికనేటి, భాను కొరియోగ్రఫీ.