హైదరాబాద్‌కి చెందిన తెలుగమ్మాయి మోడల్, నటి చైతన్య పోలోజు కేన్స్ రెడ్ కార్పెట్‌పై హాలీవుడ్ తారలతోపాటు కూడా సందడి చేసే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంజలి పౌఘట్ డిజైనర్ డ్రీమ్ కలెక్షన్ ధరించి చైతన్య పోలోజు రెడ్‌కార్పెట్‌పై అందర్నీ మెస్మరైజ్ చేశారు. వత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియా నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా, గృహిణిగా బాధ్యతలను నిర్వహిస్తూనే… నటిగా, మోడల్‌గా, కనెక్ట్ హౌప్కు కో ఫౌండర్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా చైతన్య పోలోజు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే పేద విద్యార్థులు, మహిళలు, బాలికలను డా.ఆనంద్ బంజారా మహిళా ఎన్జీవో లాంటి స్వచ్చంద సంస్థల ద్వారా ఆదుకుంటూ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. భర్త సాయిరాం సహకారంతో నటిగా తన కలల సాకారం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ… ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడవడం నా జీవితంలో మరచిపోలేని రోజు. మిసెస్ భారత్ న్యూయార్క్ 2019 విజేతగా, మిసెస్ భారత్ అమెరికా రన్నరప్‌గా, మిసెస్ తానా డిసి 2019 రన్నరప్‌గా, మిసెస్ టాలెంటెడ్ 2019 లాంటి ప్రతిష్టాత్మక కిరీటాలను గెల్చుకున్నాను. నటిగానూ రాణించే ప్రయత్నం చేస్తున్నాను’ అని తెలిపారు.