ప్రముఖ వ్యాపారవేత్త ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్వీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సాంబశివరావు డైరెక్షన్లో మారుతీరామ్, జియోడార్ల జంటగా రాజనాల సతీష్ విలన్‌గా తొలిపరిచయం కాబోతున్న సినిమా “రాంగ్ నెంబర్”. అజయ్‌ఘోష్, సుమన్ శెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రాంగ్ నెంబర్ చిత్ర ట్రైలర్, లిరికల్ సాంగ్, పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు ఆవిష్కరించారు.
నాగబాబు మాట్లాడుతూ.. “ ఆర్వీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాంగ్ నెంబర్ మూవీ పోస్టర్, ట్రైలర్ అండ్ సాంగ్‌ని రిలీజ్ చేసాను. హీరో మారుతిరామ్, డైరెక్టర్ సాంబశివరావు గారికి నిర్మాతలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ట్రైలర్ ,సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల పర్ఫార్మెన్స్, మేకింగ్ వేల్యూస్ బావున్నాయి” అని అన్నారు.
హీరో మారుతీ రామ్ మాట్లాడుతూ.. ” హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాను. ఈరోజు మా సినిమాకి సంబంధించి పోస్టర్, ట్రైలర్, సాంగ్ లిరికల్ వీడియోని మెగా బ్రదర్ నాగబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా వుంది. మా చిత్రం చాలా బాగా వచ్చింది. రిలీజ్ కి రెడీగా వుంది. అందరూ మమ్మల్ని ఆశీర్వదించి కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ” అన్నారు.
చిత్ర దర్శకుడు సాంబశివరావు మాట్లాడుతూ.. ” మేం అడిగిన వెంటనే మాకు సమయాన్నిచ్చి ట్రైలర్, సాంగ్, పోస్టర్ లాంచ్ చేసి ఆశీర్వదించిన మెగా బ్రదర్ నాగబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాగబాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించిన అనిల్ కుమార్ అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండు పాటలు, రెండు ఫైట్స్‌తో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీయడం జరిగింది” అన్నారు.
రాజనాల సతీష్ మాట్లాడుతూ.. “ నేను ప్రముఖ నటులు, దివంగత ఆర్.నాగేశ్వరరావు గారి అన్నగారి (సత్యనారాయణ) మనవడ్ని. ఈ మూవీతో విలన్‌గా పరిచయం కాబోతున్నాను. మీ ఆశీస్సులు అందరికీ వుండాలని కోరుకుంటున్నాను. మెగా అభిమానులందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను”