ప్రభాస్ వరసగా పాన్ ఇండియన్ సినిమాల షూటింగ్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ సినిమాల రేంజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ చేస్తున్న నాలుగు పాన్ ఇండియన్ సినిమాల క్రమంలో ముందుగా ‘రాధే శ్యామ్’తో రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీ-సిరీస్, గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో గుల్షన్ కుమార్, కృష్ణంరాజు సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ – ప్రమోద్ – ప్రసీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ముంబై లో ఉన్నాడు. బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్లో పాల్గొంటున్న ప్రభాస్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా బ్యాలెన్స్ టాకీ పార్ట్ హైదరాబాద్‌లో చేయనున్నాడు. దాంతో గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. ఆ తర్వాత ‘సలార్’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం గుజరాత్లో భారీ సెట్‌ని నిర్మించారట. ‘కేజీఎఫ్’ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ ఏడాదిలోనే వైజయంతీ మూవీస్ నిర్మించబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా సెట్స్ మీదకి రానుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.మొత్తానికి ప్రభాస్ ప్లానింగ్ మాత్రం భలేగుంది కదూ!
నటించమంటారా? నాన్నగారు!… ప్రభాస్ చాలా మొహమాటస్తుడు అని. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు అని. తన ప్రపంచం కూడా చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తారు తెలిసిన వాళ్లు. ప్రభాస్ స్క్రీన్ మీద కూడా అంతే సిగ్గరి. ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సిన సమయంలో చాలా మొహమాటపడతాడు ప్రభాస్. ఇదే విషయం దర్శక ధీరుడు రాజమౌళి కూడా చెప్పాడు. ‘బాహుబలి’ సమయంలో తనకు యాక్షన్ సన్నివేశాలు చేయడంలో పెద్దగా కష్టం అనిపించలేదు కానీ ప్రభాస్‌తో రొమాన్స్ చేయించడానికి మాత్రం చాలా కష్టపడ్డాను’ అని చెప్పాడు.
ప్రభాస్ ఎంత మొహమాటస్తుడో ఆయన స్నేహితుడు, మేనేజర్,నటుడు అయిన ప్రభాస్ శీను ఒక ఇంటర్వ్యూలో చాలా విశేషాలు చెప్పాడు. అప్పట్లో ఒక సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించడానికి తన తండ్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నాడని ప్రభాస్ గురించి సెన్సేషన్ న్యూస్ చెప్పాడు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన ‘అడవి రాముడు’ సినిమాలో నటించాడు ప్రభాస్. ఇందులో ఆర్తి అగర్వాల్‌తో ఒక ముద్దు సన్నివేశంలో నటించాడు ప్రభాస్. అయితే ఈ సన్నివేశంలో నటించాల్సి ఉండగా.. ముందు తన తండ్రి సూర్యనారాయణ రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు ప్రభాస్.
ఆయనకు లొకేషన్ నుంచి ఫోన్ చేసి ఇలా ఒక సన్నివేశం ఉంది నటించమంటారా? నాన్నగారు! అంటూ అనుమతి తీసుకున్నాడని.. తండ్రి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశంలో ప్రభాస్ నటించాడని శీను తెలిపాడు. ప్రభాస్‌కు తన తల్లిదండ్రులు అంటే అంత గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఎంత ఇమేజ్ .. ఎంత మార్కెట్ పెరిగినా ప్రభాస్ ఇప్పటికీ అంతే అణుకువగా ఉన్నాడని”.. చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను.