‘కలెక్టివ్ డ్రీమర్స్’ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్, వారి మిత్ర బృందం నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం ‘బ్రాందీ డైరీస్’. వ్యక్తిలోని వ్యసన స్వభావంవల్ల వచ్చే సంఘర్షణలు.. సహజమైన సంఘటనలతో.. సంభాషణలతో.. పరిణితి ఉన్న పాత్రలతో వస్తున్న చిత్రమే’బ్రాందీ డైరీస్’.గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించారు. జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇచ్చారు. సాయి చరణ్, హరిచరణ్,రవికుమార్ విందా నేపధ్య సంగీతం సమకూర్చారు. ఏప్రిల్లో విడుదల చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. మిత్రులు సినిమాను పూర్తి చేయడానికి ముందుకు రావడంతో వారందరి సహకారంతో క్రౌడ్ ఫండెడ్ మూవీ గా నిర్మించడం జరిగింది. చాలామంది సహకారం ఉన్నందుకు ఈ బ్యానర్ ను కలెక్టివ్ డ్రీమ్ గా పేరు పెట్టడం జరిగింది. కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని ‘బ్రాందీ డైరీస్’ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి? దాని వలన ఏం నస్టం జరుగుతుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని అన్నారు.
నిర్మాత లేళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ .. సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా ‘మూవీ మాక్స్’ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఇంకా ఈ ప్రెస్మీట్ లో హీరో శేఖర్ ,హీరోయిన్ సునీత సద్గురు, కీలక పాత్ర పోషించిన రవీంద్రబాబు, నటుడు నవీన్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రకాష్ రెక్స్,సి నిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్,
ఎడిటర్: యోగ శ్రీనివాస్