సామాజిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ ఈ సినిమాను సమర్పణలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ `నా బంగారు తల్లి` డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న చిత్రం `రక్తం`. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ 2017లో అవార్డును గెలుచుకుంది. ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్లో ఈ అవార్డు వచ్చింది.
సంజు శివరామ, మధు శాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నక్సలైట్స్ గ్రూపుకు చెందిన కథాశంతో సినిమాను రూపొందించారు. విప్లవం ఆలోచనాత్మక విధానంలో సంఘర్షణల ఆధారంగా సినిమా ఉంటుంది. ఆల్బర్ట్ కామస్ లెస్ జస్టెస్ ఆధారంగా ఈ సినిమాను కరీంనగర్, హైదరాబాద్‌ల్లో తెరకెక్కించారు. హింసాత్మక మార్గంలోని నైతిక విలువలు గురించి ఈ సినిమాలో దర్శకుడు రాజేష్ స్పృశిస్తున్నారు. మధుశాలిని డీ గ్లామర్ రోల్లో నటించింది. బెనర్జీ కీలక పాత్రలో కనిపిస్తాడు. సనా, బిందు, జాన్ కొట్టొలి తదితరులు ఇతర పాత్రధారులు.
‘Raktham’: Rajesh Touchriver’s drama continues to receive acclaim
National Award-winning director Rajesh Touchriver of ‘Na Bangaru Thalli’ fame is coming up with a social drama titled ‘Raktham’ (The Blood).