“బాలీవుడ్ అంటే అందరూ ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాటన్నింటిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను”… అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఓ పక్క నెపోజిటంతో మరో పక్క డ్రగ్స్ తో బాలీవుడ్ అతలాకుతలమై పోతోంది. ఇంత జరుగుతున్నా.. స్టార్ హీరోలెవరూ ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై అక్షయ్ కుమార్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
“ఎవరికి, ఎలా, ఏం చెప్పాలో అర్థం కాక ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయా. బరువెక్కిన హృదయంతో ఈరోజు మాట్లాడుతున్నాను. నా అభిప్రాయాలను చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. కానీ సరియైన సమయం కాదని అనిపించింది. మమ్మల్ని ఇప్పటికీ స్టార్స్ అనే పిలుస్తున్నారు. బాలీవుడ్ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే అది ప్రేక్షకుల అభిమానం వల్లే. సినిమా ఇండిస్ట్రీ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదు. సినిమా అనే మాధ్యమం ద్వారా భారతీయ విలువలను, సంస్కృతిని, అలవాట్లను ప్రపంచంలోని ప్రతి చోటకి ప్రచారం చేస్తున్నాం.ప్రజల సెంటిమెంట్లను సినిమాలు ప్రతిబింబిస్తాయి.
అయితే ప్రేక్షకులంతా ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారంటే.. ఆ కోపాన్ని మేము ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఏర్పడిన పరిస్థితులతో అందరూ ఎంతగా బాధపడ్డారో, మేమూ అంతే బాధ పడ్డాం. అసలేం జరుగుతుంది అనేలా.. మేమే ఆశ్చర్యపోయేలా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ అంటే అందరూ ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాటన్నింటిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. బాలీవుడ్ అంతా కరెక్ట్‌గా, క్లీన్‌గా ఉందని అబద్దం చెప్పలేను. అన్ని రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది. డ్రగ్స్ విషయంలో విచారణలు జరుగుతున్నాయి. న్యాయ, చట్ట వ్యవస్థలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది కరెక్టే అవుతుందని బలంగా నమ్ముతున్నాను. సినిమా ఇండిస్ట్రీలోని ప్రతి వ్యక్తి దీన్ని నమ్మి, సహకరించాలని కోరుతున్నాను. చేతులు జోడించి వేడుకుంటున్నా ఇండిస్ట్రీలోని అందరినీ ఓకేలా మాత్రం చూడకండి. అందరినీ దోషులుగా భావించకండి. ప్లీజ్’ అని అక్షియ్ తన ఆవేదనని వ్యక్తం చేశారు.
విదేశాల్లో ‘బెల్ బాటమ్’ షూటింగ్ పూర్తి … అక్షయ్ కుమార్.. జెడ్ స్పీడుకు కరోనా తాత్కాలింగా బ్రేకులు వేసింది కానీ.. పూర్తిగా వేయలేదని చెప్పాలి. ఈ యేడాది అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఆ సంగతి పక్కన పెడితే.. అక్షయ్ కుమార్.. తాజాగా ‘బెల్ బాటమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇవ్వడంతో.. విదేశాల్లో ఈ సినిమా మిగిలిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసాడు.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా హీరోయిన్స్‌గా నటించారు.ఈ చిత్రాన్ని ఆగష్టులో మొదలు పెట్టి సెప్టెంబర్ 30న కంప్లీట్ చేసారు. ఈ చిత్రాన్ని ఎక్కువగా స్కాట్లాండ్, గ్లాస్గోలలో పిక్చరైజ్ చేసారు. చివరగా లండన్‌లో కంప్లీట్ చేసారు. ఈ చిత్రాన్ని 1980లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రియల్ హీరో జీవిత కథ అని చెబుతున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గూఢచారిగా ఎలాంటి ఛాలెంజెస్ స్వీకరించాడనే దానిపై ఈ సినిమాను పూర్తి ఉత్కంఠ భరితంగా దర్శకుడు రంజిత్ ఎం.తివారీ తెరకెక్కించాడు. మరోవైపు అక్షయ్ కుమార్.. త్వరలో ‘పృథ్వీరాజ్’, ‘ఐతరంగీ రే’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. మొత్తంగా అక్షయ్ కుమార్ కరోనా సమయంలో భారీగా విరాళం అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ సంపాదన ఉన్న నటుడిగా ఫోర్బ్స్‌లో పత్రికలో చోటు దక్కించుకున్నాడు.