గాయని చిన్మయి శ్రీపాద తన గానమాధుర్యాన్ని ఓ మంచి పనికి ఉపయోగించారు. అభిమానుల కోసం పాటలు పాడుతూ, శుభాకాంక్షలు చెప్తూ 82 లక్షల రూపాయలను విరాళంగా సేకరించారు. ఈ మొత్తాన్ని లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అందించనున్నారు. కోవిడ్ విపత్తువేళ తన గొప్ప మనసు చాటుకుంది. కాగా కరోనా వల్ల చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చూసి చలించిపోయిన చిన్మయి ఏప్రిల్‌లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటి సమంత కు విలక్షణంగా వినిపించే గొంతు చిన్మయి దే. ఆమె సమంత కు మంచి మిత్రురాలు కూడా. అలాగే ఇటీవల దర్శకుడయిన నటుడు రాహుల్ రవీంద్రన్ ను చిన్మయి వివాహం చేసుకుంది.
గాయని చిన్మయి శ్రీపాద ఇటీవల సినిమా పరిశ్రమలోని వివాదాస్పదమైన విషయాలను సోషల్ మీడియాలో చర్చకుపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ జైలుపాలు అయ్యారు. అనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హార్వీకి 23 ఏళ్ల శిక్ష పడింది. హార్వీ ఉదంతంతో హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమాన్ని భారత్‌లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించగా… దక్షిణాదిన చిన్మయి ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది చిన్మయి. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆ తర్వాత డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి ఆమె తొలగించారు.
చారిటీకి కొంత డబ్బు డొనేట్ చేయాలి!
బర్త్‌డే విషెస్ అయినా.. ఎవరి కోసమైనా పాట డెడికేట్ చేయాలన్నా… శుభాకాంక్షలు చెప్పాలన్నా.. వారు ముందుగా చారిటీకి ఎంతో కొంత డబ్బులు డొనేట్ చేసి ఆ మొత్తాన్ని స్క్రీన్‌షాట్ తీసి పంపాలి. అప్పుడు వారి కోసం ఆమె పాట పాడి ఆ వీడియోను పంపుతుంది. అలా ఇప్పటివరకు మూడు వేలకు పైగా వీడియోలను చేసి 85 లక్షల డబ్బు జమ చేసింది…
“కరోనా వల్ల ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఓ రోజు తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడి విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా నన్ను కోరాడు. 800 కుటుంబాల దీన పరిస్థితి గురించి వివరాలతో సహా మాకు సమాచారం పంపారు. అది ఎంతవరకు నిజమని కనుక్కునే క్రమంలో ఎన్నో విషయాలు తెలిశాయి. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరికొందరు శారీరక, మానసిక పరిస్థితి బాగోలేనివారు. హఠాత్తుగా వచ్చిపడ్డ కరోనా వైపరీత్యం వల్ల వారికి పూట గడవడమే కష్టంగా మారింది. అప్పుడే నిర్ణయించుకున్నా, వారికి నా వంతు సాయం చెయ్యాలని. అందుకే ఎవరైనా సరే, ఏదైనా పాట కావాలన్నా,..శుభాకాంక్షలు చెప్పాలన్నా.. విరాళమిస్తే చాలు వీడియోలు చేసి పంపాలని నిర్ణయించుకున్నా. ఎక్కువగా బర్త్‌డే విషెస్ చెప్పమని అడిగేవారు. ఒక్కోరోజు 75 వీడియోలు కూడా చేశాన”ని చిన్మయి శ్రీపాద చెప్పింది..