‘మోస‌గాళ్లు’లో విష్ణు, కాజ‌ల్‌ అన్నాచెల్లెళ్లు !

విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ తోబుట్టువులుగా ..ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని ఆన్ స్క్రీన్ బ్ర‌ద‌ర్‌-సిస్ట‌ర్ జంట‌గా అల‌రించ‌నున్నారు.లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరె క్షన్లో ..హాలీవుడ్‌-ఇండియ‌న్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘మోస‌గాళ్లు’ చిత్రంలో వీరు అలా కనిపిస్తారు.
సినిమాల్లో హీరో హీరోయిన్లుగా న‌టించేవాళ్లు తోబుట్టువులుగా చేయ‌డం అరుదు. ‘ర‌క్త సంబంధం’లో ఎన్టీఆర్‌, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా, ‘కృష్ణార్జునులు’లో శోభ‌న్‌బాబు, శ్రీ‌దేవి అన్నాచెల్లెళ్లుగా న‌టిస్తే.. బాలీవుడ్‌లో షారుఖ్ కాన్‌, ఐశ్వ‌ర్యా రాయ్ అన్నాచెల్లెళ్లుగా క‌నిపించారు. ఇప్పుడు ‘మోస‌గాళ్లు’లో విష్ణు, కాజ‌ల్‌ల‌ను తోబుట్టువులుగా చూడ‌బోతున్నాం.
 
క‌మిట్‌మెంట్‌తో త‌ను చేసే క్యారెక్ట‌ర్ల‌కు ప్రాణం పోస్తుంద‌ని పేరు పొందిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ‘మోస‌గాళ్లు’ కోసం ఒక స్పెష‌ల్ వ‌ర్క్‌షాప్‌కు హాజ‌ర‌య్యారు. చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న ‘మోస‌గాళ్లు’ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి, రుహీ సింగ్‌, న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లలో చేస్తున్నారు.’మోస‌గాళ్లు’కు హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ షెల్డ‌న్ చౌ ప‌నిచేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై విష్ణు మంచు నిర్మిస్తోంది. ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త్వ‌ర‌లోనే మోస‌గాళ్లు ఎప్పుడు విడుద‌ల‌య్యేదీ నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌నున్నారు.