“మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం అంటే, మీరే సొంతంగా డబ్బును ముద్రించుకోవడం లాంటిది. సొంతంగా చేసే వ్యవసాయంలోని ఆనందం వెలకట్టలేనిది”…అని అంటోంది సమంత. లాక్డౌన్ సమయాన్ని సమంత సద్వినియోగం చేసుకుంటోంది సమంత . హైదరాబాద్ స్వగృహంలోని టెర్రస్‌పై ఏర్పాటు చేసుకున్న మిద్దెపై ఖాళీ ప్రదేశంలో చిన్నపాటి స్టాండ్స్ ఏర్పాటు చేసుకోని.. వాటిలో సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలతో పాట కూరగాయల్ని పండిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. తాను ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాల్ని వివరిస్త్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాజాగా ఈ వీడియోలో.. ‘మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం అంటే, మీరే సొంతంగా డబ్బును ముద్రించుకోవడం లాంటిది’- అనే వ్యాఖ్యను జత చేసింది. మిద్దెపై వ్యవసయం గురించి సమంతా… ఇప్పటికే అందుకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
వ్యవసాయంలో ఆనందం వెలకట్టలేనిది!
“తమకు ఉత్తమమైన వాటిని ప్రతి ఒక్కరూ చేయడానికి ఇష్టపడతారు. వారిలో సృజనాత్మకతకు కొదవలేదు. డ్యాన్స్, ఆర్ట్, వంట, కవిత్వం..ఇలా ఎన్నో ఉన్నాయి. అవి నేను చేయలేనని నాకు తెలుసు. అందరూ చేసే దానికి కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటా. అదేమీ ఆశ్చర్యపోయే విషయం కాదు. అది చాలా సులభం కూడా. తోటపనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో పోస్ట్‌లు చేశా. అయితే, ఎందుకు ఈ ప్రయాణం ప్రారంభించానో చెప్పాలనుకుంటున్నా… లాక్డౌన్ ప్రకటించగానే అందరిలాగే నేనూ ఆశ్చర్యపోయా. సరుకుల కోసం నేను, చైతన్య సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తాం. మీలో చాలా మంది ఇదే చేసి ఉంటారు. తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టాం. అవన్నీఅయిపోతే చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో అందరం భయపడ్డాం. పైగా మీకు, మీ ఆప్తులకు ఆరోగ్యకరమైన ఆహారం కష్టమే. ఆ పరిస్థితితో నేను గందరగోళానికి గురయ్యా. మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదు.స్వచ్ఛమైన కూరగాయల అవసరం తెలిసొచ్చింది. ఈ విపత్కర పరిస్థితి నాకు ఒక పాఠాన్ని నేర్పింది. అందుకే అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నా. ఆరోగ్య శ్రేయస్సుతో పాటు పర్యావరణ సంరక్షణ కోసమే ఇంటివద్ద కూరగాయల్ని పండిస్తున్నా. మనం, ‘ఆహారం ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది కదా !’ అనే భావనలో ఉంటాం. మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్ చేసి భోజనాన్ని ఇంటికి తెప్పించుకుంటాం. ఆహారం చాలా విలువైనదని మనలో చాలా మంది గుర్తించరు. అందుకే టెర్రస్‌పై తోటను ఏర్పాటు చేసి కూరగాయల్ని పండించాలనుకున్నా. సొంతంగా చేసే వ్యవసాయంలో ఆనందం వెలకట్టలేనిది”…అని చెప్పింది సమంత