చాలాసార్లు త‌ప్పుగా ప్ర‌చారంగా చేశారు !

నయనతార పన్నెండేళ్లకు పైగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న దక్షిణాది స్టార్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చినా గత కొన్నేళ్లుగా గ్లామర్ షో కాస్త తగ్గింఛి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళుతోంది .ఆమె సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నా పర్సనల్ లవ్ లైఫ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయింది. మొదట ఓ సినీ హీరోని వదులు కొని..ఆ తర్వాత పెళ్లి పీటలెక్కే ముందు ఓ కొరియోగ్రాఫర్‌ను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత నయన్ జీవితంలోకి ఓ డైరెక్టర్ వచ్చాడు.. అతనే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రానికి ఆమె ప్రియుడు విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడులోని ఓ ఆల‌యంలో పెళ్లి చేసుకోనున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా నయనతార తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..
“నా మనసులోని భావాలను ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు. నేను పూర్తిగా ప్రైవేట్ మనిషిని. అందుకే ఎక్కడా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. కేవ‌లం నేను న‌టించిన సినిమాల గురించే మాట్లాడ‌తాను .గతంలో, నేను మీడియాతో మాట్లాడిన విష‌యాల‌ను. చాలాసార్లు త‌ప్పుగా ప్ర‌చారంగా చేశార‌ని వాపోయింది. అందుకే ఇలాంటివి తన‌వ‌ల్ల కాద‌ని,మీడియాకు దూరంగా ఉంటే.. లేనిపోని వివాదాల‌కు కూడా దూరంగా ఉండేందుకు వీలవుతుంద‌ని ఆమె చెప్పింది. న‌య‌న్ ఇప్పుడు ‘కాతు వాకుల రెండు కాదల్‘ అనే సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ఆమె ప్రియుడు విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.
 
నాకు సినిమాలంటే ఇష్టం లేదు!
నయనతార.. చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించినా, బికినీలో అభిమానులకు కనువిందు చేసినా ఆమెకే చెల్లింది. మూడుపదుల వయస్సులో కూడా వన్నెతరగని అందంతో వెండితెర మీద దూసుకుపోతోంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతి కొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. అయితే నయనతారకు అసలు సినిమాలంటే ఇష్టం లేదట. ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చిందట…
‘‘నిజమే. నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇంక నటన అంటే ఏకోసానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవు. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చింది. ముందు చేయననే అన్నాను. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని చేశాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఆ సంవత్సరంలో దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. మధ్యలో నా వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు కొద్దిగా దూరమయ్యాను తప్ప అవకాశాలు లేక మాత్రం కాదు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు పోషించాను..’’ అని నయనతార చెప్పుకొచ్చింది.