దాని వెనక ఎంత కష్టం ఉందో ఇప్పుడే అర్ధమవుతోంది!

ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్‌ ను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. మన భోజనం మన చెంతకు చేరడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది’’ అంటున్నారు సమంత.  సమంత తన సున్నితమైన వేళ్లతో మట్టిలో విత్తనాలను నాటుతున్నారు. ఇది ఏ సినిమాలోని పాత్ర కోసమో కాదు.. నిజ జీవితంలోనే. సమంత తన ఇంటి టెర్రస్‌పై ఓ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. ‘‘హ్యాపీ ప్లేస్‌. ఇలా మట్టిలో విత్తనాలు నాటడం నా హృదయాన్ని సంతోషంతో నింపివేసింది. మా టెర్రస్‌పై గార్డెనింగ్‌ చేయడానికి సాయం చేసినవారికి ధన్యవాదాలు’’ అని చెప్పింది సమంత. ఈ గార్డెనింగ్‌ క్లాసులతో తెలుసుకుంటున్న విషయాలు తనకు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయని ..ఆసక్తికర విషయాలు తెలుసుకునే సమయం మీ దగ్గర ఉన్నట్లయితే గార్డెనింగ్‌ను స్టార్ట్‌ చేయమని నేను సలహా ఇస్తాను. ప్రస్తుతం నేను గార్డెనింగ్‌ చేస్తున్నాను.
 
ఇంతకాలం భూమితో నాకు ఉన్న కనెక్షన్‌ ను నేను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. నా భోజనం ప్లేటు నా టేబుల్‌పైకి రావడం వెనక ఎంత పెద్ద పని దాగి ఉందో అర్థం అవుతోంది. ఒక చిన్న విత్తనాన్ని నాటినప్పుడు అది భూమిని చీల్చుకుని పైకి రావడానికి చాలా స్ట్రగుల్‌ పడుతుంది. ఆ తర్వాత అది రోజులు, నెలలు, సంవత్సరాలు పెరుగుతుంది. ఈ విధానానికి మనం అందరం కనెక్టయ్యే ఉంటామని అర్థం చేసుకోవాలి’’ అన్నారు. అలాగే సమంత కుకింగ్‌ క్లాసుల్లో చేరారు. ఓ సూపర్‌ సూప్‌ను తయారు చేశారు. తన గార్డెనింగ్‌లో పెరిగిన మొక్కల ఆకులతోనే సమంత ఈ సూప్‌ను తయారు చేశారట.
 
పది స్వచ్ఛంద సంస్థలకు సాయం!
దక్షిణాదిన టాప్‌ 5 హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ఉంటుంది. ఇటు సోషల్‌ మీడియాలోనూ సమంతకు ఫాలోయర్స్‌ ఎక్కువే. ‘‘నా కుటుంబం కోటిమంది’’ అని తెగ సంబరపడిపోతున్నారు సమంత. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫాలోయర్స్‌ సంఖ్య పది మిలియన్ల (కోటిమంది)కి చేరడమే.
‘‘నా ఫ్యామిలీ టెన్‌ మిలియన్స్‌కు చేరింది. ఈ సందర్భంగా నేను పది స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సమంత. ట్వీటర్‌లో సమంతకు 8 మిలియన్స్‌ ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘జాను’ తర్వాత మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు సమంత. తమిళంలో మాత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.