‘బాహుబలి’కి ముందు నిర్మాతలు డి.వి.వి.దానయ్య, కె.ఎల్. నారాయణలు రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు రాజమౌళి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మహేష్ బాబుతోనే సినిమా అని తేల్చేశారు. ‘బాహుబలి’కి ముందు నిర్మాతలు డి.వి.వి.దానయ్య, కె.ఎల్. నారాయణలు రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. మహేష్ బాబు హీరోగా ఓ కౌబాయ్ సినిమా చేద్దామని నిర్మాత కె.ఎల్ నారాయణ అనుకున్నారట. కానీ మధ్యలో ‘బాహుబలి’ రావడంతో .. ఏడేళ్లు గడిచిపోవడం జరిగిపోయాయి. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో రాజమౌళి దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిపోయారు. ఆ తర్వాత రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మొదలుపెట్టేశారు. కె.ఎల్. నారాయణతో సినిమా చేయడానికి రాజమౌళికి సమయం లేకుండాపోయింది. డి.వి.వి. దానయ్యతో ప్రస్తుతం రామ్‌చరణ్ -ఎన్టీఆర్‌లతో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్నారు.
మహేష్ బాబుతో వచ్చే ఏడాది సినిమా చేసేలా నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారట. ‘ఆర్ ఆర్ ఆర్’ ముగిశాక మహేశ్ బాబుతో సినిమా చేయడానికి జక్కన్న ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇంతకీ మహేష్ ఎలాంటి జోనర్‌లో.. ఏ కథతో రాజమౌళి సినిమా తీస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ‘కౌబాయ్ కథ’ అని ఒకసారి.. కాదు ‘జేమ్స్ బాండ్ టైప్’ సినిమా కథ అని ప్రచారం సాగింది. రాజమౌళి సైతం జేమ్స్‌బాండ్ లాంటి కథ అయితేనే మహేష్ బాబుకు సరిపోతుందని అన్నారు. తాజాగా రాజమౌళి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు… మహేష్ బాబుతో సినిమా గురించి ఇప్పుడే ఏ కథ అనుకోలేదని.. తాము ఏమీ చర్చించుకోలేదని రాజమౌళి తెలిపారు. మహేష్ బాబు ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌తోపాటు.. నా అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాక తన తదుపరి సినిమా మొదలుపెడతానని రాజమౌళి చెప్పారు.
ట్రోలింగ్స్‌కు జక్కన్న వివరణ
రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘పారసైట్’ తనకు నచ్చలేదని ఆ సినిమా చూసేటప్పుడు తాను నిద్రపోయానని ఆయన అన్నారు. దాంతో ఆయనపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయితే ఈ ట్రోలింగ్స్‌కు జక్కన్న ఓ ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చారు. ‘‘‘పారసైట్’ నచ్చకపోవడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక జ్యూరీలో చాలా లాబీయింగ్ ఉంటుంది. ఓ సినిమాను జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగం నడుస్తుంది. అయితే, చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేయించి అవార్డ్ తీసుకునే పరిస్థితి ఉండదని అంటారు. దానిపై నాకు పరిజ్ఞానం లేదు. గతంలో కూడా నాకు ఆస్కార్ గెలిచిన కొన్ని చిత్రాలు నచ్చాయి, కొన్ని నచ్చలేదు’’ అని చెప్పారు.