కొరటాల సినిమా ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.ఎనిమిదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరు తన సినిమాల స్పీడ్ పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి లాక్‌డౌన్ వలన తాత్కాలిక బ్రేక్ పడినా… వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే కొరటాల సినిమా తర్వాత చిరంజీవి పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించారు చిరంజీవి….
“లూసిఫర్’ రీమేక్ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నాను. బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా… మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచన ఉంది. హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్ లాంటి యువ దర్శకులని ఇటీవల మా ఇంట్లోనే కలవడం జరిగింది. స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. కొరటాల సినిమా పూర్తైన తర్వాత తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను.యువ దర్శకులతో పని చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. నన్ను చూసి పెరిగిన వారికి కొత్తగా ప్రజెంట్ చేయాలనే తపన ఉంటుంది. వారి కొత్త ఆలోచనలతో సినిమా చేయడం నాకు కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుందని చిరంజీవి అన్నారు.
డిసెంబర్ వరకు సమయం పడుతుంది!
“తెలుగు సినీ పరిశ్రమ కరోనా నుంచి జూలై వరకు కోలుకుని చిత్రీకరణలు జరుపుకునే అవకాశం వుందని, అయితే థియేటర్లు మాత్రం ప్రారంభం కావడానికి డిసెంబర్ వరకు సమయం పడుతుంద”ని చిరంజీవి తెలిపారు. కరోనా కారణంగా ఆగిపోయిన తెలుగు సినిమా చిత్రీకరణలు, సినిమా విడుదల, థియేటర్ల రీ ఓపెనింగ్‌పై ‘మెగాస్టార్’ చిరంజీవి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు… తెలుగు సినీ పరిశ్రమ కరోనా నుంచి జూలై వరకు కోలుకుని చిత్రీకరణలు జరుపుకునే అవకాశం వుందని, అయితే థియేటర్లు మాత్రం ప్రారంభం కావడానికి డిసెంబర్ వరకు సమయం పడుతుందని తెలిపారు. అంతేకాదు కరోనా ప్రభావం తెలుగు సినీ పరిశ్రమపై పెద్దగా వుండదని, ఇదంతా తాత్కలికమైనని, కరోనా వల్ల తెలుగు సినిమా బిజినెస్, తదితర అంశాలపై పెద్దగా ప్రభావం వుండదని చిరు పేర్కొన్నారు.