నటిగా నాకు ఉపయోగ పడే పాత్రలనే ఎంపిక చేసుకుంటా!

“భర్త వృత్తి, వ్యక్తిగత విషయాలలో భార్య పాత్రను నేను చాలా దగ్గర నుంచి చూశాను. తన భర్త కలల తన కలలుగా భావించి వాటి సాకారానికి మహిళ పడ్డ తపన ‘83‘లో చూస్తాం. ఈ సినిమాలో చేయడం రణవీర్‌, నాకూ సర్‌ప్రైజే” అని చెప్పింది దీపిక.
 
దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌ దంపతులు ఇప్పటికే ‘రామ్‌ లీలా‘, ‘బాజీరావు మస్తాని‘, ‘పద్మావత్‌‘ వంటి చిత్రాల్లో కలసి నటించారు. తాజాగా 1983లో భారత క్రికెట్‌ జట్టు వరల్డ్‌ కప్‌ సాధించిన నేపథ్యం ఆధారంగా రూపొందుతోన్న ’83’లో నటించారు. ఆఫ్‌ స్క్రీన్‌లోలాగే ఆన్‌స్క్రీన్‌లోనూ భార్యభర్తలుగా కనిపించనున్నారు. కపిల్‌ దేవ్‌గా రణవీర్‌ సింగ్‌, రోమి దేవిగా దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ సందర్భంగా తన భర్త రణవీర్‌తో తెరపంచుకోవడం గురించి దీపికా మాట్లాడుతూ…
 
“మా ఇద్దరమూ కలసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సినిమాలు ఇప్పటికే చేశాం. కానీ ఇందులో పాత్ర, కాస్ట్యూమ్స్‌, మాటలు చాలా విభిన్నం. అందువల్ల మా నటనకు ఇదొక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చిన్న పాత్రే చేసినా చరిత్రలో ఐకానిక్‌ సంఘటల గురించి నా పాత్ర చెబుతుంది. ఈ క్యారెక్టర్‌ చేయడం ఓ గౌరవంగా భావిస్తున్నా. భర్త వృత్తి, వ్యక్తిగత విషయాలలో భార్య పాత్రను నేను చాలా దగ్గర నుంచి చూశాను. తన భర్త కలల తన కలలుగా భావించి వాటి సాకారానికి మహిళ పడ్డ తపన ’83’లో చూస్తాం. ఈ సినిమాలో చేయడం రణవీర్‌, నాకూ సర్‌ప్రైజే” అని చెప్పింది దీపికా.
 
చపాక్‌‘ గురించి మాట్లాడుతూ… ” నటిగా నాకు ఏది ఉపయోగమో ఆ పాత్రలనే నేను ఎంపిక చేసుకుంటా. నిర్ధిష్టంగా ఈ సినిమాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే నిర్మాతగా మారతాను. ప్రస్తుతానికి వచ్చినవి చేసుకుంటూ పోతున్నాం” అని చెప్పింది.
 
హాలీవుడ్‌ ‘ద ఇంటర్న్‌’కి హిందీ రీమేక్‌
‘చప్పాక్‌’ తర్వాత దీపికా పదుకోన్‌ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి బాలీవుడ్‌లో ఉంది. ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారామె. తన తదుపరి చిత్రం ‘ద ఇంటర్న్‌’ అని ప్రకటించారు. 2015లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ ‘ద ఇంటర్న్‌’కి ఇది హిందీ రీమేక్‌. హాలీవుడ్‌ చిత్రంలో రోబర్ట్‌ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్‌ చేయనున్నారు. రిషీ కపూర్‌ కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే పాత్రలో దీపిక నటిస్తారట. ఈ సినిమాను హాలీవుడ్‌ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌తో కలిసి దీపికా నిర్మించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. దర్శకుడు ఎవరనేది తెలియాలి. ‘‘నా తదుపరి చిత్రం ‘ది ఇంటర్న్‌’ రీమేక్‌ అని ప్రకటించడానికి థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు దీపికా
 
దీపికా నిర్మాతగా మరో చిత్రం ‘మహాభారత్‌‘ రానుంది. దీంతో పాటు ప్రాంతీయ చిత్రాలు కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ‘భాష అన్నది ఎప్పటికీ హద్దు కాదు. కొత్తగా, ఎగ్జయిట్‌ అయ్యేలా ఏది ఉంటుందన్నదే నటిగా ఆలోచిస్తా. ఇంకో విషయం ఏమిటంటే… చాలా మంది దక్షిణాది దర్శకులు, రచయితలు తరచూ నన్ను కలుస్తున్నారు. అందుకే సరైన కంటెంట్‌ గురించి చూస్తున్నా’ అని పేర్కొంది.