తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ‘స్టాలిన్’ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. జీవా నటించిన తాజా చిత్రం ‘స్టాలిన్’. దీనికి ‘అందరివాడు’ ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం విడుదలకానున్న సందర్భంగా ‘స్టాలిన్’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా విచ్చేసిన రాంగోపాల్ వర్మ బిగ్ సిడి ని ఆవిష్కరించారు.
రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ… స్టాలిన్ అనే వర్డ్ నాకు ఫేవరేట్ వర్డ్. ఈయన ఒక రష్యన్ డిక్టేటర్,తరువాత చిరంజీవిగారి స్టాలిన్,మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను.ట్రైలర్ బాగుంది.జీవా చాలా ఈజీ గా నటించాడు.. ఇందులో నవదీప్ విలన్ గా చేస్తున్న లుక్ డిఫ్రెంట్ గా ఉంది.నాకు నీ గెటప్ నచ్చింది.నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం.అందుకే నాకు నువ్వంటే ఇష్టం.హీరోయిన్ రియా చక్కగా నటించింది.దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు.నట్టి ఫామిలీ కు,వేల్స్ శ్రవణ్ కు ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. జీవా తండ్రి ఆర్.బి.చౌదరి బ్యానర్ నుంచి రాజశేఖర్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు.వారి ఫాథర్ పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు.’రంగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ అంతకంటే పెద్ద హిట్ అవ్వాలి.ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఈజీ.ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారు వచ్చారు.ఆయన వస్తే ఆటోమిటిక్ గా జనాల్లోకి వెళ్తుందని అన్నారు…
హీరో జీవా మాట్లాడుతూ… నాకు మొదటి నుండి తెలుగు ఆడియోన్స్ తో మంచి అనుబంధముంది.రంగం నుండి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.ఆర్.జి.వి.సినిమాలం టే నాకు చాలా ఇష్టం.మా డాడీ ని అడిగాను..ఆర్.జి.వి గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని,ఆయన దగ్గర వర్క్ చేస్తే యాక్టింగ్ తో పాటు అన్ని నేర్చుకుంటాము. తెలుగులో స్ట్రెయిట్ మూవీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.ఈ సినిమా అందరి హార్ట్స్ ని టచ్ చేస్తుంది ఫామిలీ సెంటిమెంట్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఆడియోన్స్ కు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయిఅన్నారు..
చిత్ర దర్శకుడు రతిన శివ మాట్లాడుతూ.. ఇది తమిళ్ మూవీ అయినా తెలుగు ఆడియోన్స్ ను దృష్టి లో పెట్టుకొని రాసుకొన్నాను.ఇందులో మంచి సోషల్ మెసేజ్ ఉంది.తెలుగు ఆడియోన్స్ కు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు..
ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, నిర్మాతలు: డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: రతిన శివ