మెహ్రీన్ పోయిన ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘F2’ తో చివరిసారిగా సక్సెస్ అందుకుంది .ఆమె ప్లాప్స్ పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. కుర్రకారుని ఆకట్టుకున్న బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా కెరీర్ పరంగా ప్రస్తుతం ఫ్రస్టేషన్ లో ఉంది. రెండు పదుల చిత్రాలకి చేరువైన ఈమె కెరీర్ లో విజయాలను వేళ్ళ మీద లెక్క కట్టవచ్చు. కానీ.., ఈ అమ్మడికి అవకాశాలకి కొదవ లేదు. అయితే వరుస చిత్రాలు చేస్తున్నా.. తాజాగా ఈ 2020 జనవరి లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది మెహ్రీన్. ఇందులో భాగంగా మెహ్రీన్ నటించిన తమిళ చిత్రం ‘పటాస్’, తెలుగు మూవీ ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేక పోయాయి.
మెహ్రీన్ నటించిన ‘అశ్వద్దామ’ ఈ వారం విడుదలయ్యింది. ఈ చిత్రం పై మెహ్రీన్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతోనైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలన్నది ఈ హీరోయిన్ ఆలోచన. అయితే ‘అశ్వద్దామ’ కు నెగిటివ్ స్పందన వస్తోంది. మెహ్రీన్ నటించిన తమిళ చిత్రం ‘పటాస్’ తెలుగులో ‘లోకల్ బాయ్’ పేరుతో విడుదల కానుంది.
అపజయాలకు తాము కారణం కాదు!
మెహ్రీన్ నటిగా రంగప్రవేశం చేసి అప్పుడే ఐదో ఏటను టచ్ చేసేసింది. ఈ ఐదేళ్లలో తెలుగు, తమిళం, మాతృభాష పంజాబీ .. పలు భాషల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. తెలుగులో మంచి క్రేజ్‌నే సంపాదించుకుంది. పోతే తమిళంలో ఇటీవలే సక్సెస్ రుచిని చూసింది. ఇంతకుముందే సుశీంద్రన్ దర్శకత్వంలో ‘నెంజిల్ తునివిరుందాల్’ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అందుకే అక్కడ ఈమెని పెద్దగా పట్టించుకోలేదు. దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ ‘పటాస్’ లో ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం గుర్తింపును తెచ్చి పెట్టింది.. కానీ మరిన్ని అవకాశాలను మాత్రం అందించలేదు. చిత్ర అపజయాలకు తాము కారణం కాదని ఆమె అంటోంది.
మెహ్రీన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ…. “తాను నటించే ప్రతి చిత్రం విజయం సాధించాలని ఆశిస్తానని చెప్పింది. కథా పాత్రల్లో లీనమై అంకితభావంతో నటిస్తానని అంది. అయినా తాను నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యి నిరాశకు గురిచేశాయని చెప్పింది. నిజం చెప్పాలంటే.. అపజయాలకు నటీనటులు కారణం కాదని అంది. ఆ చిత్రాల కథలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, లేకుంటే ఎంత శ్రమించి నటించినా వృధానే”.. అని అంటోంది .మెహ్రీన్ అంతగా ప్రాణాన్ని పణంగా పెట్టి నటించిన చిత్రాలేమిటో గానీ.. ఇప్పుడు ఆమెకు చేతిలో సినిమాలు లేవు. అందుకే ఫ్రస్టేషన్‌లో మెహ్రీన్ అలా మాట్లాడుతుందని కామెంట్ చేస్తున్నారు.