పేదపిల్లల సంక్షేమానికి సమంత ‘ప్రత్యూష’ సపోర్ట్

సమంత ‘ప్రత్యూష సపోర్ట్‌’ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది.సమంత నటి మాత్రమే కాదు..సేవాగుణమున్న మహిళ అని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితో చేసిన ఈమె ఇటీవల ఆంధ్ర ఆసుపత్రి ‘హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌’ను సందర్శించి సేవా కార్యక్రమాలు కొనసాగించింది . ఆమె గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందిస్తారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత.
 
సమంత ఇటీవల ప్రత్యూష సపోర్టు సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో సరదాగా గడిపారు. పిల్లల మధ్య తాను కూడా చిన్నపిల్లగా మారిపోయారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిస్తూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఎప్పుడూ పిల్లల మధ్యనే ఉంటూ పిల్లలతో కాలక్షేపం చేయడానికే సమంత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లల ఫొటోలను తాను వారితో గడిచిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఆమె పట్ల అభిమానులు మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు. సమంత చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పేదపిల్లల సంక్షేమంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.
 
కొత్త చిత్రాలకి పచ్చజెండా
సమంత కొత్త చిత్రాలకి పచ్చజెండా ఊపిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. 2019లో సక్సెస్‌పుల్‌ కథానాయకిగా తమిళంలో ‘సూపర్‌డీలక్స్’, తెలుగులో ‘మజిలి’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళంలో సంచలన విజయాన్ని అందుకున్న 96 తెలుగు రీమేక్‌ ‘జాను’ లో నటించి పూర్తిచేసింది. కాగా ఇప్పుడు తొలి సారిగా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ‘ది ఫ్యామిలీ మాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. తాప్సీ హీరోయిన్‌గా ‘గేమ్‌ ఓవర్‌’ వంటి సక్సెస్‌పుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ సరవణన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది.లేడీ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందనున్నట్లు సమాచారం.
 
తాజాగా మరో చిత్రానికి సమంత పచ్చజెండా ఊపినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇంతకుముందు మలయాళ నటుడు నవీన్‌ పౌలీ హీరోగా ‘రిచ్చీ’ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ రామచంద్రన్‌ కొత్త చిత్రానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇందులో సమంత ప్రధాన పాత్ర కి అంగీకరించినట్లు సమాచారం. చాలా ఆసక్తికరమైన కథాంశంతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందని టాక్‌. కాగా సమంత హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలోఈ నటించే చిత్రాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నారు .