ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా ఓ నిర్మాణ సంస్థను పెడుతున్నారు… దాని పేరే ‘అలీవుడ్’. ‘అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్’ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరంలోనే దాన్ని ఆయన ప్రారంభించారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా మనం చూశాం. ఇకముందు ‘అలీవుడ్’ ను కూడా చూడబోతున్నాం. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఈ సంస్థ సంకల్పం. మణికొండలోని అలీ నివాసానికి దగ్గరగా ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది.
వీరు వెబ్ సిరీస్,టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించే పనిలో ఉన్నారు. అలీకి వెన్నెముక అయిన బాబా నేతృత్వంలో.. క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తాయి. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో వెబ్ సీరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుందని, నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా ‘అలీవుడ్’ సంస్థ కల్పిస్తుందన్నారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని కోరారు.