‘రౌడీ’ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. యువ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. విజయ్ సినీ రంగ ప్రవేశం చేసిన అతి కొద్ది కాలంలోనే ‘పాన్ ఇండియా’ హీరోగా రంగ ప్రవేశం చేయనుండటం విశేషం. పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో `ఫైటర్` పేరుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుందట. హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారారు. పూరి, ఛార్మితో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించడానికి ఓకే చెప్పారని సమాచారం.
విజయ్ కేవలం సినిమాలకే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇప్పటికే ‘రౌడీ’ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇంతకు విజయ్ స్టార్ట్ చేయనున్న వ్యాపారమేంటో తెలుసా? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్. ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. మహబూబ్ నగర్లో ‘ఏవీడీ’ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. గత ఏడాది మహేశ్‌తో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ తాజాగా విజయ్ దేవరకొండతో చేతులు కలపడం విశేషం.
అంచనాలు పీక్స్ లెవల్‌కు వెళ్లాయి!
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఈ అంచనాలకు తోడు హీరోతో నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌పై టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల మందుకు రానుంది.