మోహన్ బాబు చిత్ర రంగం లోకి మొదట సహాయ దర్శకుడిగానే అడుగు పెట్టాడు . ఆ తర్వాత దాసరి ప్రోత్సాహం తో నటుడయ్యాడు. తనదైన డైలాగ్స్ తో ఆడియన్స్ మనసులు దోచుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. హీరోగా, విలన్ గా నటించిన ఈయన ప్రత్యేక పాత్రలలోను సందడి చేశాడు. నిర్మాతగా ఎన్నో చిత్రాలు నిర్మించారు . ఇక ఇప్పుడు దర్శకత్వం చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది
మోహన్ బాబు తనయుడు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ అనే చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ పాత్రని సునీల్, ప్రభాస్ చేస్తాడని వార్తలు రాగా, చివరికి బంతి మంచి విష్ణు కోర్టులోకే వెళ్ళిందని టాక్. ఇక ఈ సినిమాని ఎవరు తెరకెక్కిస్తారు? అనే విషయంలో ముందు వరుసలో తనికెళ్ళ భరణి, ఆ తర్వాత కృష్ణవంశీ ఉన్నారనే వార్తలు వినిపించాయి. కాని ఇప్పుడు తన తనయుడిని కన్నప్ప పాత్రలో అద్భుతంగా చూపించేందుకు మోహన్ బాబు మెగా ఫోన్ పట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది . దీనికోసం ఏర్పాట్లు కూడా జరుగు తున్నట్టు సమాచారం. విష్ణు కన్నప్ప పాత్రలో కనిపిస్తే, మోహన్ బాబు శివుడిగా కనిపిస్తాడట. వివిధ భాషలలో అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది