‘దిశ‘ సంఘటన ఆధారంగా చేస్తున్న చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటించడానికి సమంతా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.’దిశ’ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ దర్శకుడు శరవణన్ సిద్దమయ్యాడు. సమంతతో చర్చలు జరిపి.. శర వేగంగా ఈచిత్రం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు శరవణన్.
హీరోయిన్స్ చాలా మంది గ్లామర్ డాల్స్‌గానే మిగిలిపోతుంటారు.అయితే, సమంత ఇందుకు మినహాయింపని చెప్పుకోవచ్చు. పెళ్లి తరువాత కూడా కెరీర్ ని .. ఇమేజి తగ్గకుండా కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం సమంతా ప్రయోగాల బాట పట్టింది. ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ లాంటి మూవీస్ చేసిన సమంత..ఇప్పుడు ‘దిశ’ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని అంతా అభినందిస్తున్నారు. ‘దిశ’ పాత్రలో సమంత నటించబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సమంత సామాజిక బాధ్యతగా ఫీలై చేయబోతున్న ఈ చిత్రం.
ప్రస్తుతం సమంత ’96’ రీమేక్ తెలుగు వెర్షన్లో నటిస్తోంది. దీనితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సీరీస్తోనూ ఆకట్టుకోనుంది. ‘96’ మూవీ రీమేక్ పూర్తైన వెంటనే సమంతా ఈ కొత్త ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వనుందట.
ఇష్టం లేక ‘నో’ అందా ?
మన హీరోయిన్లు హిందీ చిత్రాల్లో నటించాలని ఆశపడుతుంటారు. బాలీవుడ్ చిత్ర పరిధి చాలా పెద్దది. అందువల్ల ఇమేజి తో పాటు మార్కెట్ పెరుగుతుంది. అలా కొందరు హీరోయిన్లు బాలీవుడ్లో పాగావేయాలని ప్రయత్నించినా.. అక్కడ గుర్తింపు పొందలేకపోయారు. తాప్సీ ఒక్కరే బాలీవుడ్లో అవకాశాలను అందుకుని అక్కడ సెటిల్ అయ్యింది. నయనతార, అనుష్క లకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా’ నో’ చెప్పేశారు. ఇప్పుడు నటి సమంత కు కూడా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం సాగుతోంది.
సమంత ‘యూ టర్న్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళం రీమేక్‌లో సమంత ఎంతో ఇష్టపడి నటించింది. ఇప్పుడు అదే చిత్రం హిందీలో రీమేక్ కానుంది. ఇందులో సమంతకే నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆమె నిరాకరించినట్లు సమాచారం. అలా బాలీవుఢ్ ఎంట్రీని కాదన్న సమంత ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ఇండస్ట్రీ’గా మారింది. అయితే తను ఎంతో కోరుకుని నటించిన ‘యూటర్న్’ ఆశించిన విజయాన్ని సాధించలేదన్న నిరాశతో కాదందా లేక బాలీవుడ్లో నటించడం ఇష్టం లేక ‘నో’ అందా ? అన్న చర్చ మాత్రం జరుగుతోంది.