టాలీతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది!

పూజా హెగ్డే కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈఏడాది పూజ నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.తక్కువ సమయంలో ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్న నాయిక పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ పూజ దూసుకుపోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిత్రాలు చేసేస్తుంది పూజా హెగ్డే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పూజకు వరుస అవకాశాలు వస్తున్నాయి…
అల్లు అర్జున్ సరసన పూజ నటించిన `అల వైకుంఠపురములో..` జనవరి 12న విడుదల కాబోతోంది.ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా పూజ నటిస్తోంది.ఇది వేసవిలో విడుదల కాబోతోంది. అలాగే, ప్రభాస్ చిత్రం ‘జాన్’ లో కూడా పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. అది కూడా వచ్చే ఏడాది విడుదల . ఇక, ఇటీవల పూజ నటించిన `హౌస్‌ఫుల్-4` విజయవంతం కావడంతో బాలీవుడ్ నుంచి పూజకు రెండు అవకాశాలు వచ్చాయట. ఆ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ ఏడాది పూజ నటించిన మూడు చిత్రాలు ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘హౌస్‌ఫుల్-4’ విడుదలయ్యాయి.
 
‘హౌస్‌ఫుల్‌ 4’ లో పూజాది చిన్న పాటి పాత్రే అయినా మెప్పించింది. తాజాగా బాలీవుడ్‌లో మరో రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే వెల్లడించింది. “అవును. నేను బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేందుకు అంగీకరించాను. అందులో ఒకటి సాజిద్‌ నదివాయాలా ప్రొడక్షన్‌లో రూపొందనున్న సినిమా. మరొక సినిమా గురించి నేను ముందుగా చెప్పడం సరికాదు. నేను చేస్తున్నవాటిలో అదొక అద్భుతమైన సినిమా. ఆ ప్రాజెక్టు గురించి ఫిల్మ్‌మేకర్లు త్వరలో ప్రకటిస్తారు” అని పేర్కొంది పూజా. హిందీలో ఈమె తొలిసారిగా ‘మొహంజో దరో’ సినిమాతో ప్రవేశించింది. తర్వాత తెలుగు చిత్రాల్లో వరుస పెట్టి విజయాలను నమోదు చేసుకుంటుంది.
 
చెప్పడానికి చాలా ధైర్యం కావాలి!
‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే.. ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను’’ అని ‘మీటూ’ మూమెంట్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే.
‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడమంటే.. సినిమాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బందిని ఏం తెలియనివ్వలేదు. ఈ చిత్ర కథా రచయిత ఫర్హాద్‌ సమ్‌జీను దర్శకుడిగా నియమించి పూర్తి చేసింది ’’ అని పేర్కొన్నారు.