వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై ’దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో’ఖైదీ’లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా రూపొందిన చిత్రం ’దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ డిసెంబర్ 20న అందిస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీ ఇంటర్వ్యూ
’ఖైదీ’ ఎక్స్పెక్టేషన్స్ అందుకోగలరా?
– అలా ఆలోచించి నేను ఏ పని చేయను. ప్రతి సినిమాకు నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే చూశాను. ఇప్పటివరకు 19 సినిమాలు చేశాను. ప్రతిదీ నాకు నచ్చిన సినిమాలే చేస్తూ వచ్చాను. నా స్క్రిప్ట్ ఎంపికలో మాత్రం జాగ్రత్తగా ఉంటాను.
సినిమాలో నచ్చిన అంశం
‘రంగ్ దే బసంతి’ సినిమాకు వర్క్ చేసిన రైటర్ రెన్సిల్ డి సిల్వ ఈ స్క్రిప్ట్ ను నా దగ్గరకు తీసుకురావడం జరిగింది. స్క్రిప్ట్ లో అక్క క్యారెక్టర్ నాకు నచ్చింది. అప్పుడే వదినకు వినిపించాను. ఆమెకు బాగా నచ్చింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ గా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ అయితే ఈ కథకు పూర్తి న్యాయం చేయగలరు అనిపించి.. అతన్ని కాంటాక్ట్ అవడం జరిగింది. కార్తీ, జ్యోతిక ఇద్దరు చేస్తున్నారంటే నేను తప్పకుండా చేస్తాను అని చేశారు. జీతూ జోసెఫ్ కి స్క్రిప్ట్ నచ్చగానే నాకు సినిమా మీద నమ్మకం పెరిగింది.
వదిన జ్యోతికతో కలిసి చేస్తున్నప్పుడు
రెగ్యులర్ గా ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నట్లే ఉండేది. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అలాంటివే. అయితే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ గ్రేట్. పైగా ఆవిడది స్ట్రాంగ్ క్యారెక్టర్. తమిళం నేర్చుకొని.. పంచ్ డైలాగ్స్ చెప్పి.. ఇవి నీ సినిమాలో పెట్టుకో అనేవారు. అలాగే మా ఫాదర్ రోల్ లో నటించిన సత్యరాజ్ గారిది కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ ల పక్కన చేస్తున్నపుడు మనకు తెలియకుండానే బాగా చేస్తాము .
స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి
సినిమా గురించి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి అలాగే సస్పెన్స్ ఉంది. ‘దృశ్యం’ డైరెక్టర్ కాబట్టి అతడి స్పెషాలిటీ థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. నా క్యారెక్టర్ ‘ఊపిరి’ సినిమాలో నేను చేసిన ‘శీను’ క్యారెక్టర్ లా ఉంటుంది. సినిమాలో మాత్రం ‘నాపేరు శివ’ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ‘నా పేరు శివ’, ‘ఊపిరి’ కలిపితే వచ్చిన డిఫరెంట్ ఫిలింలా ఉంటుంది.
సత్యరాజ్ పవర్ఫుల్ క్యారెక్టర్
సత్యరాజ్ గారితో ‘చినబాబు’ సినిమా చేశాను. ఈ స్క్రిప్ట్ విన్న తరువాత ‘తండ్రి క్యారెక్టర్ సత్యరాజ్ గారు చేస్తారంటేనే సినిమా చేద్దాం’ అని అన్నాను. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన కూడా ‘చాలా రోజుల తరువాత పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది’ అని చెప్పారు. అలాగే షావుకారి జానకి, సీత గారి క్యారెక్టర్స్ కూడా కీలకంగా ఉంటాయి.
‘దొంగ’ టైటిల్ సరిపోతుంది
మీరు ‘ఊపిరి’ సినిమా చూస్తే ఆ సినిమాకు ‘దొంగ’ అని టైటిల్ పెట్టొచ్చు..కేవలం దొంగతనం చేయడమే కాదు.. ఇతరుల మనసుల్ని దోచుకున్నా ‘దొంగ’ టైటిల్ సరిపోతుంది. ఒక ‘దొంగ’ మంచివాడిగా మారి అందరి హృదయాల్ని ఎలా దోచుకున్నాడనే కధ కాబట్టి ఆ టైటిల్ సరిపోయింది .
చిరంజీవి ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’
‘ఖైదీ’ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. ఈ సినిమాకోసం ‘తమ్ముడు’ టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ‘దొంగ’ కూడా చిరంజీవి గారి టైటిల్ కావడం నిజంగా హ్యాపి.
ఒక క్లాస్ మేట్ తో చేస్తున్న ఫీలింగ్
చాలా కాలం తర్వాత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తో చేస్తున్నాను. చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. షూటింగ్ స్పాట్ కి వెళ్ళగానే ‘సినిమా అనేది టీమ్ ఎఫర్ట్ . మనం అందరం కలిసి మంచి సినిమా తీద్దాం’ అనేవారు. ప్రతి రోజు ఉదయం అందరం కలిసి కూర్చొని ఆరోజు చేయాల్సిన సన్నివేశాల గురించి మాట్లాడుకుని చేసే వాళ్ళం. అతనితో సీనియర్ డైరెక్టర్ లా కాకుండా ఒక క్లాస్ మేట్ తో చేస్తున్న ఫీలింగ్.
ప్రతి ఒక్కరూ ఇష్టపడి పనిచేశారు
ఆర్ డి రాజశేఖర్ గారు చాలా సీనియర్ సినిమాటోగ్రాఫర్. అలాగే మా అన్నయ్య సూర్య కి ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ’96 ‘ సినిమాకు చేసిన గోవింద్ వసంత గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘కెజిఎఫ్’ డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఇష్టపడి పనిచేశారు. అందుకే 65 రోజుల్లో అనుకున్నటైమ్కి షూటింగ్ పూర్తి చేయగలిగాము.
నాగార్జున ట్వీట్ ‘బ్లాక్ బస్టర్ ఆన్ ది వే’
‘దొంగ’ తెలుగు టీజర్ నాగార్జున గారు విడుదల చేశారు. ‘టీజర్ చూడగానే చాలా బాగుంది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని ట్వీట్ పెట్టారు. ఆయన చాలా మంది డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఆయనకు మా టీజర్ నచ్చడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
రావూరి వి. శ్రీనివాస్ కు సినిమా మీద ఫ్యాషన్
హర్షిత మూవీస్ రావూరి వి. శ్రీనివాస్ గారు ఈ సినిమాను తెలుగులో చేస్తున్నారు అనగానే చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మంచి సినిమా తీయడమే కాదు, దానికి మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను.