`పెళ్ళిచూపులు’,`మెంటల్ మదిలో`నిర్మించిన అభిరుచి గల ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో `చూసీ చూడంగానే`చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది.నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి.. `మెంటల్ మదిలో` కెమెరా మెన్ వేద రామన్ సినిమాటోగ్రఫీ. డిసెంబర్ నెలలొ చివరి వారంలొ విడుదల .`చూసీ చూడంగానే` చిత్రం ట్రైలర్ ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్.. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు సంయుక్తంగా రిలీజ్ చేసారు
శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్ తదితరులు నటీనటులు
బ్యానర్: థర్మపథ క్రియేషన్స్, విడుదల -సురేశ్ ప్రొడక్షన్స్
డైలాగ్స్: పద్మావతి విశ్వేశ్వర్, ఎడిటర్: రవితేజ గిరిజాల