వారంతా కలిసి నన్ను అలా మార్చేస్తారు!

నా శరీరం మార్చుకునే పనులు మొదలు పెట్టా.  క్రీడాకారుల్లా నా దేహాన్ని మార్చడమే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లక్ష్యం“…అని తాప్సి చెప్పింది . లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ..ఇటీవల 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది..త్మరలో మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితం తెరపై ఆవిష్కృతం కాబోతుంది. మిథాలీ రాజ్‌గా తాప్సీ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. తాప్సీ నటిస్తున్న నాలుగవ క్రీడా ప్రధాన చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ‘సూర్మ’, ‘సాండ్‌ ఖి ఆంఖ్‌’ చిత్రాల్లో నటించింది.ఇందులో ‘సూర్మ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే .. ‘సాండ్‌ ఖి ఆంఖ్‌’ మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.తాప్సీ గుజరాత్‌కి చెందిన అథ్లెట్‌ రష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘రష్మీ రాకెట్‌’లోనూ నటిస్తోంది. దీంతోపాటు ‘తడ్కా’,’తప్పడ్‌’ లోనూ తాప్సీ నటిస్తూ బిజీగా ఉంది.
 
పరుగెత్తడంలో ఆమె ఒక రాకెట్‌
పాత్ర డిమాండ్‌ మేరకు తాప్సీ కూడా భారీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు రంగం సిద్ధం చేసింది. ‘రష్మి రాకేట్‌’ అనే చిత్రంలో తాప్సీ టైటిల్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అథ్లెట్‌గా కనిపించబోతుంది. రష్మి ఓ గ్రామీణ యువతి. ఆమె అద్భుతమైన రన్నర్‌. పరిగెత్తడంలో ఆమె ఒక రాకెట్‌ లాంటిదని ఆ గ్రామం గుర్తిస్తుంది. అథ్లెట్‌గా చేసే అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను ప్రొఫెషనల్‌గా చూపిస్తుంది. అవాంతరాలు దాటి ఓ అథ్లెట్‌గా విజయం సాధించినప్పుడే ఈమెకు గుర్తింపు దక్కుతుంది. ఈ చిత్రానికి ఆకర్ష ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు.
 
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈమె ప్రపంచ స్థాయి పరుగుల పోటీల్లో రాకెట్‌లా రన్నింగ్‌ చేసి విజయం సాధించే రష్మి పాత్రలో తాప్సీ చేస్తుంది. ఈ పాత్రకు తగ్గట్టు తాప్సీ మారడానికి ప్రత్యేక బృందమే పని చేస్తుందట. ఆ విషయాలను ఈ కథానాయికే స్వయంగా వెల్లడించింది.” నా శరీరం ట్రాన్స్‌ఫర్మేషన్‌ పనులు మొదలు పెడుతున్నా. నా దేహాన్ని క్రీడాకారుల్లా మార్చడమే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లక్ష్యం. దానికి ప్రత్యేక శిక్షణ బృందం పని చేస్తోంది. నూట్రిసినిస్టు..ఫిజియోథెరఫిస్ట్‌ ..కొంతమంది కలసి స్క్రీన్‌ మీద అథ్లెట్‌ ఎలా ఉండాలో అలా నన్ను మారుస్తారు. ‘భాగ్‌ బాల్ఖా భాగ్‌’, ‘మ్యారీ కోమ్‌’ వంటి చిత్రాల్లో క్రీడాకారులుగా నటించిన ఫర్హాన్‌ అక్తర్‌, ప్రియాంక చోప్రా వంటివారు నాకు స్ఫూర్తి”… అని చెప్పింది
తాప్సీ.
కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చూడండి
గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకల్లో ‘ఉమెన్‌ ఇన్‌ లీడ్‌’ అనే అంశంపై తాప్సీ మాట్లాడింది… ‘‘మీరు ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండాలనుకుంటే థియేటర్స్‌కు వెళ్లి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ చూడండి. ఒక్క కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధిస్తే… ఐదు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ వస్తాయి . ఇది కథానాయికలకు ఎంతో మేలు చేస్తుంది. ఆ విధంగా మీరు.. కొత్తగా రావాలనుకునే హీరోయిన్స్‌లో మీరు కూడా ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు’’ అని అన్నారు.