ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్..పూర్వీ పిక్చర్స్ బ్యానర్ల పై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాతలు .ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ… ‘‘స్నేహితులు కలిసి చేసిన చిత్రమిది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ ’’ అని అన్నారు.
వీరి నాయుడు మాట్లాడుతూ… ‘‘విశాఖలో పూర్వి పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్థాపించి, పాతిక సంవత్సరాల నుండి విజయవంతమైన చిత్రాలు విడుదల చేశాను. మా అబ్బాయి శ్రీనివాస్, అతడి మిత్రుడు బాలు, ఇద్దరి స్నేహితులు కలిసిచేసిన ఈ సినిమా ప్రయత్నం విజయవంతం కావాలి ’’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రెండీగా.. కమర్షియల్‌గా ఉంది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ… ‘‘వీరి నాయుడుగారు వాళ్లబ్బాయి శ్రీనివాస్, మేం కలిసి ఈ సినిమా చేశాం. షూటింగ్ పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఉండే నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది కధ’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాస్ పాల్గొన్నారు.
సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బడిజ, కో–డైరెక్టర్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, అసోసియేట్ డైరెక్టర్: లక్కీ బెజవాడ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎల్‌ఎన్ వారణాసి, వైజేఆర్, లైన్ ప్రొడ్యూసర్: నేహా మురళి, రఘురామ్ ఎరుకొండ, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్