పూరి జ‌గన్నాథ్‌ విడుద‌ల చేసిన `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. గురువారం(న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా ‘నిశ్శ‌బ్దం’ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు.
తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది . ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
Nishabdam teaser released by Puri Jagannadh
Anushka who was last seen in a guest appearance in Megastar Chiranjeevi’s Sye Raa Narasimha Reddy is set to wow the audiences in a new avatar as she plays a mute artist named Sakshi.The film also stars Madhavan and Anjali in key roles.
 
As Anushka celebrates her birthday on November 7, the team releases the film’s teaser .Puri Jagannadh released the Telugu teaser while director Gautam Vasudev Menon released the Malayalam and Tamil teaser. Director Neeraj Pandey releases the Hindi teaser.
Nishabdam will release in Telugu, Tamil, Malayalam, Hindi and English. The release date of the crossover film directed by Hemanth Madhukar will be announced soon.
The film also has an ensemble cast of Michael Madsen, Hunter O’ Hara, Shalini Pandey, Srinivas Avasarala and Subbaraj amongst others.
Music: Gopi Sunder,Editing: Praveen Pudi, Art: Chad Raptor
Stylist: Neeraja Kona,Stunts: Alex Terjiff,DOP: Shaniel Deo
Screenplay, Dialogues: Kona Venkat,Co-producer: Vivek Kuchibotla