వై.ఎఫ్ క్రియేటివ్స్ పతాకం పై నిర్మించిన ‘జ్వాలాముఖి’ సినిమా ఆడియో లాంచింగ్ కార్యక్రమం “తెలంగాణా ఫిలిం చాంబర్” (TFCC)లో జరిగింది .ఇందులో ముఖ్య అతిధిగా TFCC చైర్మన్ డా. ప్రతాని రామక్రిష్ణ గౌడ్ ,వైస్ చైర్మన్ గురురాజ్, T -MAA సెక్రటరీ స్నిగ్ధ, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, లిరిక్స్ గురుచరణ్, డైరెక్టర్ హరిశంకర్ మట్టగుంట, ప్రొడ్యూసర్ యూసఫ్ యం.డి, DOP కిరీటి లు పాల్గొన్నారు .
TFCC చైర్మన్ డా ప్రతాని రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ… ఈ ఆడియో విని అందరు ఆదరించాలని ..ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరారు. చిన్న సినిమాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలిపితే.. తప్పకుండ సహాయం చేస్తామని ఆయన తెలిపారు . సినిమాలు అన్ని ఒక్కటే అని, అందులో చిన్న.. పెద్ద తేడాలు లేవని వైస్ చైర్మన్ గురురాజ్ గారు పేర్కొన్నారు