‘హీరో’ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తంచేశాడు. కార్ రేస్ నేపధ్యంలో భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “తను నటిస్తున్న’హీరో’ ఒకసారి ప్రారంభమైందని, మరోసారి ఆగిపోయిందని మీడియా రకరకాలుగా రాసేస్తోందని.. వాటిలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేద”ని విజయ్ దేవరకొండ స్పష్టంచేశాడు. ‘హీరో’ ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు… “ ‘హీరో’ అనే సినిమా గురించి చెప్పాలంటే నిర్మాత లేదా డైరక్టర్ చెప్పాలి. లేదంటే నేను చెప్పాలి. విచిత్రం ఏంటంటే… మీడియా వాళ్లు అన్నీ చెప్పేశారు. ఒకసారి ‘క్యాన్సిల్’ అన్నారు, మరోసారి ‘బ్యాక్ టు సెట్స్’ అన్నారు. ఈ వార్తలకు ఆధారాలు నాకు తెలియదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కంప్లీట్ అయిన వెంటనే ‘హీరో’ సినిమా స్టార్ట్ అవుతుంది. పూరి గారి సినిమా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది.
‘హీరో’ సినిమా మాత్రం లేట్ అవుతుందని స్పష్టంచేశాడు విజయ్ దేవరకొండ.’హీరో’ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు తీయడానికి చాలా టైం పడుతుందని, కచ్చితంగా ఆ సినిమాకు గ్యాప్ ఇస్తానని ప్రకటించాడు. అంతమాత్రానికే ప్రాజెక్టు ఆగిపోయినట్టు కాదని…అది నడుస్తూనే ఉంటుందని తెలిపాడు.
“హీరో సినిమాకు సంబంధించి ఇంకా టైం తీసుకుంటాం. ఎందుకంటే ప్రీ-విజన్ అనేది ఒకటి చేయాలి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సగం పూర్తిచేశాం. ఇంకా సగం చేయాలి. అవి భారీ యాక్షన్ సన్నివేశాలు. వాటికి ప్రీ-విజువలైజేషన్ చేయాలి. దానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ పూరి గారి సినిమా తెరకి ఎక్కించేస్తాను… ఆ తర్వాత హీరో చేస్తాను”.. ఇలా తన కమింగ్ మూవీస్ సంగతులు చెబుతూనే.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. పూరి సినిమా కంప్లీట్ అయిన తర్వాత ‘హీరో’ సినిమా ఉంటుందని, ఆ వెంటనే శివ నిర్వాణ సినిమా ఉంటుందని తెలిపాడు.