‘బొప్పన సంగీత నాటక నృత్యోత్సవం’ యువ కళావాహిని ఆధ్వర్యంలో అక్టోబర్ 28న గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం ‘అన్నమయ్య కళా వేదిక’లో కన్నులపండుగగా జరిగింది.’యువ కళావాహిని-బొప్పన పురస్కారాల’ ప్రదానం, శ్రీమతి రామరాజు లక్ష్మీశ్రీనివాస్ బృందం వీణావాదన, డా. సియస్ ప్రసాద్ బృందం ‘సుందరకాండ’ నాటిక ప్రదర్శన అద్భుతంగా జరిగాయి. వల్లూరి జయప్రకాష్ నారాయణ, రాయపాటి శ్రీనివాస్, చందు సాంబశివరావు, రవి కొండబోలు, మేకల మోహనరావు, రామరాజు శ్రీనివాసరావు, సి.హెచ్ మస్తానయ్య అతిథులుగా, గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభాకార్యక్రమంలో… ఏ. కోటేశ్వరరావు, వడలి రాధాకృష్ణ, పి. రాజా, ఏ.మల్లేశ్వరరావు, పొత్తూరి రంగారావు, హకిం జానీ ‘యువ కళావాహిని-బొప్పన పురస్కారాలు’ స్వీకరించారు. వై .కె. నాగేశ్వరరావు, బొప్పన నరసింహారావు, జి.మల్లికార్జునరావు, యంఏ హమీద్, భాగి శాస్త్రి పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
బొప్పన నరసింహారావు జన్మదినపురస్కారాలు
‘యువ కళావాహిని’ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం పద్మావతి కళా వేదికలో 29వ తేదీ ఉదయం ‘కళాపూర్ణ ప్రభాతం’ కార్య క్రమం అద్భుతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో బొప్పన నరసింహారావు జన్మదినపురస్కారాలను శతాధిక రంగస్థలకళాకారులకు,గాయనీ గాయకులు, సాహితీవేత్తలకు,నృత్య కళాకారులకు, సాంస్కృతిక అధినేతలకు ప్రదానం చేశారు. తదనంతరం ‘యన్.టి.ఆర్.కళా పరిషత్’, ‘అమరావతి ఆర్ట్స్’ ఆధ్వర్యంలో బొప్పన నరసింహారావు దంపతులకు జన్మదిన సత్కారం ఘనంగాజరిగింది. తొలుత ‘పదకోకిల’ పద్మశ్రీ చే ‘అన్నమయ్య విన్నపాలు’, సిల్వెస్టర్ మిమిక్రీ రసజ్ఞులైన కళాభిమానుల్ని ఉర్రూతలూగించాయి. రాయపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా.. వై కె నాగేశ్వరరావు సభాధ్యక్షులుగా, కావూరి సత్యనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
‘బొప్పన ఆంజనేయులు-సరోజిని స్మారక పురస్కారం’
‘బొప్పన సంగీత నాటక నృత్యోత్సవం’ రెండవరోజు 29 సాయంత్రం అన్నమయ్య కళా వేదికలో రసజ్ఞులైన కళాభిమానుల్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా… ‘బొప్పన ఆంజనేయులు-సరోజిని స్మారక పురస్కారం’ మస్తానయ్య గారు అందుకున్నారు. ఏ.యస్.రామకృష్ణ అధ్యక్షత వహించిన యీ సభలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్య అతిథిగా…రవి కొండబోలు, నూతలపాటి సాంబయ్య, యం.రఘురాం,నాయుడు గోపి, రామరాజు శ్రీనివాసరావు, వల్లభనేని బాబూరావు, జి.నెహ్రూ, రఫీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత శారదా రెడ్డి,పద్మశ్రీ, కళ్యాణి,కొల్లా వేంకటేశ్వర రావు గార్లు భక్తి సంగీత విభావరి అత్యంత రమణీయంగా సమర్పించారు.’కళా వాచస్పతి’ డా. లంక లక్ష్మీనారాయణ వ్యాఖ్యానం చేశారు.