శివన్ దర్శకుడిగా ‘శివన్’ ట్రైలర్ లాంచ్

యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. కల్వకోట సాయిజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్… ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
 
డైరెక్టర్ శివన్ మాట్లాడుతూ…
‘శివన్’ ట్రైలర్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్న. నాకు జన్మ ఇచ్చిన నా తల్లి తండ్రులకు రుణపడి ఉంటాను. నిర్మాత డి.ఎస్. రావు గారి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది. హీరో సాయి మంచి హీరోగా ఎదుగుతాడు. తరునిక హీరోయిన్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కెమెరామెన్ మీరన్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది.అందరికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుందన్నారు.
 
నిర్మాత సంతోష్ రెడ్డి మాట్లాడుతూ…
కాస్త ఆలస్యం అయినా సరే సినిమాను విడుదల చేసి అందరికీ చూపిస్తాము. నిర్మాత సి.కళ్యాణ్ గారు మా సినిమాకు అందించిన సహాయ సహకారాలు మరువలేనిది. అలాగే నిర్మాతలు డి.ఎస్.రావు గారు, పద్మనాభరెడ్డి గారు, వెంకటేష్ అన్న గారు మాకు హెల్ప్ చేశారు, వారికి స్పెషల్ థాంక్స్. భూషణ్ గారు మంచి వ్యక్తి, ఆయన వాయిస్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ట్రైలర్ ఆనుకున్న దానికంటే బాగా వచ్చింది, అందుకు డైరెక్టర్ కు స్పెషల్ థాంక్స్. సినిమా సస్పెన్స్ తో సాగుతుంది. అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది…అన్నారు
 
హీరో సాయిజ మాట్లాడుతూ…
మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా కష్టాలన్నీ అధిగమించి మేము ఈ సినిమా తీశాము. ట్రైలర్ కు అందరి నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.
సహ నిర్మాత బిట్టు మాట్లాడుతూ…
మీడియా వల్లే టీజర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ను సక్సెస్ చెయ్యాలని ప్రజలను కోరుకుంటున్న. సినిమా చాలా బాగా వచ్చింది. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అని తెలిపారు.
నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ…
మంచి సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే శివన్ సినిమాలో సస్పెన్స్ బాగుంటుంది, అన్నారు.
 
నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ…
డైరెక్టర్ శివన్ మంచి హీరో, హీరోయిన్, టెక్నీషియన్స్ ను ఎంచుకున్నాడు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. కొత్తవాళ్లు నటించిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అన్నారు.